వెనుకబడిన వర్గాలలో కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఒక లక్ష రూపాయల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసం చేశారని, కనుమరుగయినా కులావృత్తులు కాపాడాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ గారు కులవృత్తులను ఆదుకుంటున్నారన్నారు.
Also Read : Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
తెలంగాణ తెచ్చుకున్నదే వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగాలని, మళ్ళీ ఎన్నికల వస్తున్నాయ్ మళ్ళీ కొంతమంది వస్తున్నారని, వాళ్లకు అధికారం ఇస్తే అంత ఉడుసుకుపోతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నేను ఎమ్మెల్యే గా ఉన్నా.. అప్పుడు ఇంత అభివృద్ధి లేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉందన్నారు మంత్రి గంగుల. కుల వృత్తులను కాపాడేందుకు ఈ పథకం ముఖ్యమంత్రి ప్రకటించారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి నెల ఈ పథకం ద్వారా కుల వృత్తుల వారికి సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ పథకం కోసం ఎవరి లంచం అడిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి గంగుల కమలాకర్.
Also Read : Nonstick Pans : నాన్ స్టిక్ ప్యాన్స్‌లో ఈ కూరలను అస్సలు వండకండి..!