తెలుగు రాష్ట్రాల్లో రక్షా బంధన్ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తోబుట్టువులకు రాఖీలు కడుతున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో.. రాఖీ షాపులు, స్వీట్ షాపులు కలకలలాడుతున్నాయి. రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు
Huge Fire Accident in Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్‌లో అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి.
ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు.
ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. రోజూ వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్లి ఇవాళ(ఆగస్టు 30) పెద్దగా, అత్యంత కాంతివంతంగా కనిపించింది. భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినపుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది.
దాదాపు 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ప్యూ రీసెర్చి సెంటర్ చేసిన సర్వే ప్రకారం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ప్రశ్నార్థకంగా ఉందని, ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుందనే ఊహాగానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బుధవారం అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజయాబాద్‌లో న్యాయవాదిని ఇద్దరు దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. న్యాయవాది కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న న్యాయవాది ఛాంబర్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ఆయనపై కాల్పులు జరిపారు.
చెప్పకుండా బయటకు వెళ్లడమే ఆ విద్యార్థులు చేసిన నేరం. అందుకు స్కూల్ ప్రిన్సిపల్ వారిని కర్రతో వాతలొచ్చే వరకు చితకబాదాడు. ఈ ఘటన మంగళవారం జార్ఖండ్‌లోని పాలములోని సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగు గ్రామంలో జరిగింది.