రాజస్థాన్‌లో జైపూర్ జిల్లాలోని చౌము పట్టణంలో 12వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి మందలించడంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. అతను తన స్టడీ సర్టిఫికేట్లను తన బ్యాగ్‌లో ఉంచుకున్నాడు. ఇంట్లో నుంచి రూ.రెండు వేల నగదు చోరీ చేసి తల్లి చూడకముందే ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.
బుల్లెట్‌ని కిక్-స్టార్ట్ చేయడం ఎక్కువగా మగవాళ్లకు తెలుసు. కొన్నిసార్లు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అది తిరిగి రివర్స్ లో వస్తుంది. ఆ కిక్ ను కొట్టాలంటే బలంగా.. సరైన పద్ధతిలో చేయాలి. లేదంటే.. తిరిగి వచ్చి అది కాలుకు దెబ్బతీస్తుంది. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నోయిడాలోని పండ్ల మార్కెట్లో కూరగాయల అమ్మకందారుడు ఓ వ్యక్తి దగ్గర రూ. 3000 అప్పుగా తీసుకున్నాడు. అయితే తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా కొట్టాడు.. అంతేకాకుండా అతని బట్టలూడదీసి మార్కెట్ మొత్తం తిప్పాడు.
ఉత్తరప్రదేశ్ లో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటనే మరొకటి జరిగింది. మొన్న అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని.. ఆగంతకులు వేధించారు. దీంతో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. దుండగులు అక్కడి నుండి పారిపోయారు. అనంతరం విద్యార్థిని ఇంటికి వెళ్లే మార్గంలో.. మళ్లీ విద్యార్థిని వెంబడించారు. అంతేకాకుండా.. తన సైకిల్‌ను అతి వేగంతో ఢీకొట్టారు. దీంతో విద్యార్థిని కింద పడిపోగా.. బైక్‌పై నుంచి వచ్చి…
దేశంలో అల్లకల్లోలానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి ఫైజ్ హమీద్ కారణమని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని ఆయన అన్నారు.
30 ఏళ్ల సౌరభ్ చంద్రకర్ 30,000 కోట్ల రూపాయలకు యజమాని అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ బెట్టింగ్ ప్రపంచంలో ‘మహాదేవ్ యాప్’ని ప్రారంభించిన వెంటనే.. వందలాది ఇతర గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ అన్ని యాప్‌ల ప్రేక్షకులను, మహాదేవ్ యాప్ ప్రేక్షకులను కలపడం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు అయ్యారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంగళవారం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, పలు ఇతర ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి.