Moonglet Recipe: కరోనా.. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా హెల్తీ ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకొన్నారు. ఇలాంటి వారి కోసం ఓ వెజిటేరియన్, హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ మీకోసం తీసుకొచ్చేసాం. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా, తయారు చేయడం కూడా చాలా సులువు. అదికూడా చాలా త్వరగా చేసుకోవచ్చు.
వెజిటేరియన్ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునే వారు ఈ రెసిపీని ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. అదే ‘మూంగలెట్’ విత్ గ్రీన్ చట్నీ. మనం సాధారణంగా పెసరపప్పుతో పెసరట్లు చేస్తుంటాం. కానీ ఎప్పుడూ పెసరట్లే కాకుండా.. ఈసారి ఇలా మూంగలెట్‌ని ట్రై చేయండి. టేస్ట్‌లోనూ, న్యూట్రిషన్‌లోనూ ఇది చాలా బాగుంటుంది. ఈ మూంగలెట్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది పిల్లలకైనా, పెద్దవాళ్లకైనా సరిపోయే బాలెన్స్‌డ్ ఫుడ్ ఇది. ఇక ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
S*exually Assault: తిరుచానూరులో ఏడేళ్ల గిరిజన చిన్నారిపై లైంగిక దాడి
మూంగలెట్ తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పెసరపప్పును వేసి శుభ్రంగా కడిగి నానబెట్టాలి. దీనికోసం పొట్టు ఉన్న పెసరపప్పు, పొట్టు లేని పెసరపప్పు రెండింటినీ కలిపి వాడవచ్చు. మీరు ఏ ఒక్క రకం పెసరపప్పుతో అయినా ఈ రెసిపీ చేయవచ్చు. లేదా కలిపికూడా చేయవచ్చు. ముందుగా వీటిని కనీసం నాలుగు గంటలపాటు నానబెట్టాలి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు చేస్తే ముందురోజు రాత్రే నానబెట్టుకోవడం మంచిది.
పప్పు బాగా నానిన తర్వాత నీళ్లను తీసేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులో ఒక ఇంచ్ అల్లం ముక్క, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుని.. అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అర కప్పు ఉల్లి తరుగు, పావు కప్పు టమాటా ముక్కలు, పావు కప్పు క్యారెట్ తురుము, పావు కప్పు క్యాప్సికం ముక్కలు, పావు కప్పు కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలపాలి. అవసరమైంత ఉప్పు వేసుకొని, చివరగా పావు టీ స్పూన్ వంట సోడా వేసి మళ్లీ మిక్స్ చేయాలి. అంతే మూంగలెట్ కు అవసరమైన బాటర్ రెడీ.
గ్రీన్ చట్నీ తయారీ:
మిక్సీ జార్‌లో ఒక కప్పు కొత్తిమీర, పావు ఇంచ్ అల్లం, ఒకటి లేదా రెండు పచ్చిమిర్చులు, పావు ఉల్లిపాయ ముక్క, రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు, రెండు వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ (ఐచ్చికం), అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ (లేదంటే నిమ్మరసం) వేసి, కొద్దిగా నీళ్లు జోడించి ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
JanaNayaganTrailer : జననాయగన్ రీమెక్ కాదన్నారు.. కానీ భగవంత్ కేసరిని కాపీ పేస్ట్ చేశారు..
మూంగలెట్ వేసే విధానం:
స్టవ్‌పై పాన్ పెట్టి వేడి చేయాలి. కొద్దిగా ఆయిల్ లేదా బటర్ వేసి పాన్ అంతా సమానంగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు బాటర్‌ను పాన్‌పై వేసి హాఫ్ ఇంచ్ మందంగా స్ప్రెడ్ చేయాలి. ఆపై మూత పెట్టి లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత మరో వైపు తిప్పి మరో నిమిషం పాటు కుక్ చేయాలి. పిల్లలకు స్ట్రీట్ ఫ్లేవర్ కావాలంటే.. పైభాగంలో చిన్న గాట్లు పెట్టి కొద్దిగా బటర్ వేసి రెండు వైపులా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవచ్చు. అంతే ఫ్లఫీగా, టేస్టీగా, హెల్తీగా తయారైన ఈ మూంగలెట్‌ను మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.