Jowar Breakfast Recipe: ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది ఒక్క రోజు నిర్ణయంతో వచ్చేది కాదు.. రోజూ మనం తీసుకునే చిన్న చిన్న అలవాట్ల సమాహారమే నిజమైన హెల్త్‌కు పునాది. సరైన ఆహారం ఎంపిక చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన మార్గంలో అందించడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండడం వంటి అలవాట్లు బరువు నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్‌ను హెల్తీగా తీసుకోవడం రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
హై ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే సంప్రదాయ ధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ కూడా సులభమవుతుంది. అలాంటి మంచి హెల్త్ హ్యాబిట్స్‌లో భాగంగా, ఈరోజు మనం జొన్నలతో తయారుచేసుకునే సింపుల్ అండ్ న్యూట్రిషన్‌తో నిండిన బ్రేక్ ఫాస్ట్ రెసిపీని తెలుసుకుందాం. ఇది జొన్నలతో త్వరగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఉదయాన్నే కాకుండా బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్‌గా కూడా దీనిని సర్వ్ చేసుకోవచ్చు. ఇది హై ఫైబర్, హై ప్రోటీన్ ఉన్న ఈ రెసిపీ వెయిట్‌ను చక్కగా మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది.
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి.. పాముతో పోలీసులను భయపెట్టిన ఆటో డ్రైవర్
అంతేకాదు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలన్నీ కూడా అందిస్తుంది. త్వరగా బరువు తగ్గి, వెయిట్‌ను కంట్రోల్ చేయాలనుకునే వారు కనీసం వారంలో రెండు నుంచి మూడు సార్లు అయినా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. ఈ రెసిపీ తయారీ ప్రక్రియ చాలా సింపుల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్నలను వేసి శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇక్కడ పచ్చ జొన్నలైనా, తెల్ల జొన్నలైనా ఉపయోగించవచ్చు. జొన్నలు బాగా నానితే అవి సులభంగా ఉడుకుతాయి.. అంతేకాదు జీర్ణక్రియకు కూడా మంచిగా ఉంటాయి.
బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే అరగంట ముందు మరో గిన్నెలో 1/3 కప్పు పెసరపప్పు, 1/3 కప్పు వేరుశెనగ గుళ్లు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇవి ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు. జస్ట్ హాఫ్ అవర్ నానితే సరిపోతుంది. జొన్నలు, పెసరపప్పు, వేరుశెనగ గుళ్లు బాగా నానిన తర్వాత నీళ్లు పూర్తిగా వడగట్టి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. జొన్నలు కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల నీళ్లు వేసి, రుచికి సరిపడా ఉప్పు జోడించాలి. మీడియం ఫ్లేమ్‌పై సుమారు ఎనిమిది విసిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపి ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసుకోవాలి. జొన్నలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిలో ఉన్న నీటిని పూర్తిగా వడగట్టి పక్కన పెట్టాలి.
ఆ తరువాత జొన్నలకు తాలింపు పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇష్టమైతే నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వంటి తాలింపు గింజలు వేసి దోరగా వేయించాలి. తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు, అల్లం తురుము, చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు వేసి మరోసారి బాగా వేయించాలి.
Minister Savitha: ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదు..
ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసి, త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు చల్లాలి. ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా మారిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసి కలపాలి. తరువాత ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టిన జొన్నలను పాన్‌లోకి వేసి హై ఫ్లేమ్‌లో రెండు నుంచి మూడు నిమిషాలు బాగా టాస్ చేయాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపిన తర్వాత అర నిమ్మకాయ రసం పిండితే రుచి మరింత బాగుంటుంది.
ఇలా జొన్నలతో సింపుల్‌గా, త్వరగా తయారయ్యే హెల్తీ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్ రూపంలో షేర్ చేయండి.