Asian Games 2023: చైనా చేతిలో భారత ఫుట్‌బాల్ జట్టు ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 ఆసియా గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు చైనా చేతిలో 5-1 తేడాతో ఓడిపోయింది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా చైనాపై ఒక్క గోల్ మాత్రమే చేసింది. హాంగ్‌జౌలోని హువాంగ్‌లాంగ్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మరోవైపు భారత ఫుట్‌బాల్ జట్టు 2014 నుండి ఆసియా క్రీడల కోసం వేచిచూస్తుండగా.. ఓటమి ఆరంభం లభించింది. భారత్ తరఫున రాహుల్ కేపీ మాత్రమే ఒక్క గోల్ చేయగలిగాడు. 21 ఏళ్ల క్రితం ఆసియా క్రీడల్లో తలపడ్డ జట్టు.. మళ్లీ ఇప్పుడు ఆడుతున్నాయి.
Shruti Hasan : ఎయిర్ పోర్ట్ లో శృతి హాసన్ వెంటపడిన గుర్తు తెలియని వ్యక్తి..అస్సలు ఏం జరిగిందంటే..?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే.. చైనా మొదటి నుంచి భారత్ పై విరుచుకుపడుతోంది. మ్యాచ్ 17వ నిమిషంలో చైనా తొలి గోల్ చేసింది. టియానీ చైనా ఖాతా తెరిచాడు. అయితే చైనా తొలి గోల్‌కు భారత్ ఆటగాడు రాహుల్ కెపి అద్భుత సమాధానమిచ్చి.. తొలి అర్ధభాగం అదనపు సమయంలో టీమిండియాకు తొలి గోల్ చేసి మ్యాచ్‌లో 1-1తో డ్రాగా నిలిచాడు. దీంతో ఫస్టాప్ లో భారత్, చైనాలు 1-1తో సమంగా నిలిచాయి.
TSRTC: రేపటి నుంచి హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు పరుగులు
ఇక సెకండాఫ్ ప్రారంభమైన కొద్దిసేపటికే.. 51వ నిమిషంలో చైనా రెండో గోల్ చేసింది. చైనా తరఫున డై వీజున్ రెండో గోల్ చేశాడు. ఈ గోల్‌తో చైనా 2-1 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌లో వెనుకబడినప్పటికీ సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత్ చైనాను అడ్డుకోలేకపోయింది. టావో కియాంగ్‌లాంగ్ 72వ నిమిషంలో మూడో గోల్ చేసి జట్టుకు 3-1 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కేవలం మూడు నిమిషాల తర్వాత.. మ్యాచ్ 75వ నిమిషంలో టావో కియాంగ్‌లాంగ్ తన రెండో గోల్‌ను చేశాడు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 80వ ర్యాంక్‌లో ఉన్న చైనా జట్టు.. 4 గోల్స్ చేసిన తర్వాత కూడా ఆగలేదు. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంజూరీ టైమ్‌లో.. చైనా తరపున హావో ఫాంగ్ జట్టుకు 5వ గోల్ చేసి 99వ FIFA ర్యాంక్‌లో ఉన్న భారత జట్టుకు 5-1 తేడాతో ఘోర పరాజయాన్ని అందించాడు.
- Tags
- Asian Games
- china
- Football
- india
- Lost
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!