ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుండి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. దీని కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు.
ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు చరిత్ర సృష్టించారు. ఇటీవల ముగిసిన వార్షిక ప్లేస్మెంట్ డ్రైవ్‌లో ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు 3.7 కోట్ల వార్షిక వేతనంతో అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్‌కు ఎంపికయ్యారు. ఇదే ఐఐటీ బాంబే హైయెస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆఫర్ కావడం గమనార్హం.
గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, నర్మదా, దాహోద్, పంచమహల్, ఆనంద్, గాంధీనగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న 11,900 మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. మరో 270 మంది ఒంటరిగా ఉన్న పౌరులను రక్షించారు.
కేరళలో తాజా నిఫా వైరస్ వ్యాప్తికి సంబంధించి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, హైరిస్క్ కాంటాక్ట్‌ల నుంచి 200 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని వచ్చిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం కేరళలో తెలిపారు. ఇప్పటివరకు 1,233 కాంటాక్టులను గుర్తించామని, అందులో అధిక రిస్క్, తక్కువ రిస్క్ కాంటాక్టులుగా వర్గీకరించామని చెప్పారు.
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవాలని.. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.