Washington Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లో విషాదాన్ని నింపింది.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొటికలపూడి కృష్ణ కిషోర్ అనియాస్ టిన్ను, అతని భార్య ఆశ మృతి చెందిన ఘటన పాలకొల్లులో విషాదాన్ని నింపింది.. అమెరికా, వాషింగ్టన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు దుర్మరణం పాలయ్యారు.. కొటికలపూడి కృష్ణ కిషోర్, గత దశాబ్దం కాలంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంజనీర్ గా పని చేస్తున్నారు. కృష్ణ కిషోర్ ఇటీవల 10 రోజుల క్రితం గ్రామానికి వచ్చి తిరిగి అమెరికాకు వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలు నెలల పాటు కుటుంబంతో కలిసి ఉన్న వారు తిరుగు ప్రయాణంలో భాగంగా దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని ప్రయాణం కొనసాగించారు.
Read Also: Gold Rates: అంతర్జాతీయ సంక్షోభం.. మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దురదృష్టకరంగా, ప్రయాణంలో ఉన్న సమయంలో వారి కారుకు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో కృష్ణ కిషోర్ మరియు భార్య ఆశ ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారి కుమారుడు మరియు కుమార్తె ప్రస్తుతం వైద్యంలో ఉన్నారని కుటుంబం వెల్లడించారు.. వైద్యులు వారి పరిస్థితి గురించి ఇంకా అప్‌డేట్ ఇవ్వాల్సి ఉంది. అయితే, కృష్ణ కిషోర్ – ఆశ దంపతుల మృతితో పాలకొల్లులో తీవ్ర శోక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, బంధువులు వారిని పరామర్శించి ఓదారుస్తున్నారు..