హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు.
డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. అనుమానిత డ్రగ్ డీలర్ ఇంట్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన పోలీసులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి.
యూపీలోని గోరఖ్పూర్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య, ఇద్దరు సోదరులతో సహా తనపై దాడి చేశారని.. ప్రాణహాని ఉందని ఓ లెక్చరర్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్' (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
భవిష్యత్తులో కొత్త కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ హెచ్చరించారు. షి జెంగ్లీ జంతువుల నుంచి వచ్చే వైరస్లపై పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. ఆమెను ప్రపంచంలో బ్యాట్ వుమన్ అని కూడా పిలుస్తారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కారు భద్రతపై తప్పుడు హామీల కోసం ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది.