politics: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. జమిలి ఎన్నికలతో దేశ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఖజానా కూడా భారీగా ఆదా చేయవచ్చని లా కమిషన్ భావిస్తుంది. అలాగే తరచుగా ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతుందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్…
Warangal: వినాయక నిమజ్జనం పురస్కరించుకొని నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతోంది. కావున వరంగల్, హన్మకొండతో పాటు కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ మంగళవారం వెల్లడించారు.
20వ శతాబ్దం ప్రారంభం నుంచి సైన్స్, హెల్త్ కేర్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందాయి. దీని కారణంగా మానవ జీవిత కాలం కూడా పెరిగింది. అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మనుషుల వయసు పెరిగింది.
మణిపూర్‌లో కలహాల నేపథ్యంలో రెండు రోజుల తర్వాత మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
దేశంలోని రాకెట్లలో ఉపయోగించే 95 శాతం విడిభాగాలు భారత్ నుంచి వచ్చినవేనని ఇస్రో ఛైర్పర్సన్ ఎస్.సోమనాథ్ మంగళవారం తెలిపారు. సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) 82వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇస్రో చీఫ్ ప్రసంగించారు.
హర్యానా ప్రభుత్వం హుక్కా ప్రియులకు చేదువార్త అందించింది. హర్యానాలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లలో ఇకపై హుక్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా అందించడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల వ్యవహారంలో కేంద్రంపై సుప్రీంకోర్టు మళ్లీ కఠినత్వాన్ని ప్రదర్శించింది. ప్రతి పది రోజులకోసారి ఈ అంశాన్ని పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు (జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టు) తెలిపింది.
కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకుంది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయొద్దంటూ బెంగళూరు వ్యాప్తంగా కర్ణాటక జలసంరక్షణ సమితి, వివిధ రైతుసంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కావేరీ నదీ జలాల వివాదం తెరమీదకు వచ్చింది. అసలు ఈ వివాదం ఏంటి.. ఎప్పుడు ప్రారంభమైందంటే..
భారత్, కెనడాల మధ్య తాజా దౌత్య వివాదం కొనసాగుతున్న ద్వైపాక్షిక సైనిక సంబంధాలపై ప్రభావం చూపబోదని, ఈ విషయాన్ని రాజకీయ స్థాయిలో పరిష్కరించాలని కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ మంగళవారం అన్నారు.