ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, లిక్కర్ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన అనంతరం.. నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణను రానుంది. లిక్కర్ కేసులో కవిత కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Also Read : India-Canada Row: అమెరికా తన స్వలాభం కోసం భారత్, కెనడాల మధ్య శత్రుత్వానికి బీజం వేసిందా?
అయితే.. ఈ నేపథ్యంలోనే నళిని చిదంబరం తరహాలో తనకు వెసులుబాటు కావాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు తీర్పు వచ్చే వరకు బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. గత విచారణ సందర్భంగా ఈడీ ముందు మహిళల హాజరు అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలకు 10 రోజుల సమయం కోరింది ఈడీ. దీంతో కవితకు 10 రోజులపాటూ నోటీసులను వాయిదా వేసింది ఈడీ. కవిత కేసును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే.. నేడు విచారణపై సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read : Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?