IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరుపున డారిల్ మిచెల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్‌తో పాటు ఓపెనర్లు డేవన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, కుల్‌దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
READ ALSO: Do Ghosts Really Exist: ఈ భూమి మీద నిజంగా దయ్యాలు ఉన్నాయా.. ?
301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే జేమీసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కి క్యాచ్ రోహిత్ శర్మ (26) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చన విరాట్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా పరుగులు చేస్తూ వెళ్లారు. ఇదే టైంలో విరాట్ ఈ మ్యాచ్‌లో 42 పరుగులు చేసినప్పుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు ఓపెనర్ గిల్ కూడా 66 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. 56 పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ ఇన్సింగ్స్‌ను ముందుకు నడించాడు. సాఫీగా సెంచరీ దిశగా సాగిపోతున్న కింగ్ కోహ్లీని జేమీసన్ 39.1వ ఓవర్‌లో ఓట్ చేశాడు. జేమీసన్ బౌలింగ్‌లో విరాట్ మైకెల్ బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి 93 పరుగుల వద్ద ఔట్ అయ్యి సెంచరీని మిస్ చేసుకున్నాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జడేజాను కూడా 4 పరుగుల వద్ద జేమీసన్ ఔట్ చేశాడు. మైదానంలోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి శ్రేయస్ అయ్యార్ లక్ష్యం దిశగా ముందుకు సాగిపోతుండగా, 49 పరుగుల వద్ద శ్రేయస్‌ను జేమీసన్ ఔట్ చేశాడు. అయ్యర్ ఔట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన హర్షిత్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ విజయం దిశగా జట్టును నడించాడు. హర్షిత్ రాణా 29 పరుగుల వద్ద ఔట్ కాగా, తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి రాహుల్ సిక్స్‌తో మ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొత్తం రాహుల్ తన ఇన్సింగ్స్‌లో 29 చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ – న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
READ ALSO: Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..