1. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు ఈ రోజు వర్ష సూచన. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోర వానలు.
2. నేడు ఢిల్లీలో జీ20 యూనివర్సిటీ కనెక్ట్. కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ. యూనివర్సిటీ విద్యార్థులు, యువ నిపుణులతో చర్చ.
3. నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఏపీ సివిల్ కోర్ట్స్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. వ్యవసాయరంగం అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ఫైబర్‌నెట్ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ.
4. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,950 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.75,800 లుగా ఉంది.
5. నేడు హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన. ఉదయం రోజ్ గార్ మేళాలో పాల్గొననున్న కిషన్ రెడ్డి. లోయర్ ట్యాంక్‌బండ్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తర్వాత నిజామాబాద్ వెళ్లనున్న కిషన్ రెడ్డి. మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కిషన్ రెడ్డి.
6. నిర్మల్‌లోని భైంసా పట్టణంలో నేడు గణేష్ నిమజ్జనం. సమస్యాత్మక ప్రాంతం కావడంతో భారీ భద్రత. బందోబస్తులో పాల్గొననున్న 800 మంది పోలీసులు.
7. నేడు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ. అంగళ్లు కేసుతో పాటు ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ. ఇరువురి వాదనలు విననున్న ఏసీబీ కోర్టు. రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు ఇస్తామన్న జడ్జి.
8. TSPSC అప్పీల్‌పై నేడు హైకోర్టులో విచారణ. గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌లో TSPSC అప్పీల్.
9. తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ కోటా టికెట్ల పంచాయితీ. నేడు కాంగ్రెస్ అధిష్టానంతో బీసీ నేతల సమావేశం. సీనియర్లతో వరసుగా భేటీ అవుతున్న బీసీ నేతలు. బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలని డిమాండ్.
10. నేడు వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశం. హాజరుకానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు.