ఆసియా క్రీడలు 2023లో టెన్నిస్‌లో పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నంబర్-1 పురుషుల టెన్నిస్ జంట రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీలు మొదటి రౌండ్లోనే ఓటమి పాలయ్యారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 51,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు.
గూగుల్ నుంచి పిక్సెల్ 8 సిరీస్‌ను అక్టోబర్ నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే విడుదలకు ముందు పిక్సెల్ 8 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా పిక్సెల్ 8 ప్రోలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ టెలిఫోటొ కెమెరాతో ఫొటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత్‌కు సంబంధం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపించిన వారం రోజుల తర్వాత సోమవారం కెనడాలోని ప్రధాన నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని ఖలిస్థానీ గ్రూప్ తన సభ్యులకు పిలుపునిచ్చింది.
చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు సహజ రక్త శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. అయితే చాలా మంది కాకరకాయలు చేదుగా ఉండటం కారణంగా వాటిని తినరు. అయితే వాటి చేదును తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా.. కాకరకాయలు మీ ఆహారంలో తినడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. గత వారం చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఇండియాకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీసా సమస్యలు ఎదుర్కొంటుండగా.. తాజాగా శుభవార్త అందింది. ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయనున్నారు.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు ఈ యాప్ దాని గోప్యత, భద్రత కోసం ప్రతి ఒక్కరి మొదటి ఎంపికగా ఉంది.