నేడు హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం రోజ్ గార్ మేళాలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం.. లోయర్ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించనున్న చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. తర్వాత నిజామాబాద్ వెళ్లనున్న కిషన్ రెడ్డి.. మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బీజేపీ అగ్ర నేతలతో సభలకు ప్లాన్ చేస్తోంది. ప్రధాని మోడీ అక్టోబర్ ఒకటో తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. బీజేపీ మహబూబ్ నగర్ భూత్పుర్‌లో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Also Read : Festive Season 2023: గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం
ఈ సభా వేదిక నుంచి మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సహాయం రాష్ట్ర ప్రజలకు వివరిస్తూనే.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలు, తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలపై ఎండగడుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పాలమూరు సభ అనంతరం అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుపై పీఎం స్పష్టత ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో ప్రధానితో రోడ్ షో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఒక వేళ రోడ్ షో సాధ్యపడకుంటే బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. నల్లగొండలోనూ ప్రధాని మోదీతో సభ నిర్వహించాలని యోచిస్తోంది.
Also Read : India-Canada Row: అమెరికా తన స్వలాభం కోసం భారత్, కెనడాల మధ్య శత్రుత్వానికి బీజం వేసిందా?