ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి జగన్ తో గౌతమ్ అదానీ సమావేశం కొనసాగుతుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
అమరావతిలో పార్టీ కార్యకర్తలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతీ ఒక్కరూ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కంటే ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించమని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అంగన్వాడి, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, దొడ్ల, గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి చెట్ల పెంపకం కలకలం రేపుతుంది. తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్ కాలనీలో పోలీసులు భారీగా గంజాయి చెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ హైదర్ (64) అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలోనే 31 గంజాయి చెట్లను పెంచుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. దాంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. గంజాయి మొక్కల పెంపకంపై పోలీసులు ఆరా తీయగా.. వాటిని 48 సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్లు హైదర్ తెలిపారు.
రేపు 'వైఎస్సార్ వాహన మిత్ర' నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర నిధులను విజయవాడలోని విద్యాధరపురంలో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి.
ఉదయం ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి శోభయాత్ర.. హుస్సేన్ సాగర్ కు చేరుకుని భారీ భక్తజన సందోహం మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగింది. బాలాపూర్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర కొనసాగింది.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయడానికి ములుగు జిల్లానే స్ఫూర్తి అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.
హైదరాబాద్లో ఉన్న పాక్ జట్టు పూర్తి ఫుడ్ మెనూను వెల్లడించింది. ఇందులో చికెన్, మటన్ నుంచి గ్రిల్డ్ ఫిష్ వరకు అన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల ఆహారంలో ప్రోటీన్ ఉంచడం, గ్రిల్డ్ లాంబ్ చాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్లను చేర్చారు. అంతేకాకుండా ప్రోటీన్ల కోసం చికెన్, మటన్, చేపలు అడిగారట. ఇదేకాకుండా.. కార్బోహైడ్రేట్ల కోసం ఉడికించిన బాస్మతి బియ్యం, స్పఘెట్టి బోలోగ్నీస్ సాస్, వెజిటేరియన్ పులావ్ వండమని చెఫ్ కు చెప్పారు.
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు చనిపోయారు. స్నానానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.