TFI: తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రాత్మక అడుగు.. ఇకపై డిజిటల్ దుష్ప్రచారానికి చెక్!
- తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రాత్మక అడుగు
- ఇకపై డిజిటల్ దుష్ప్రచారానికి చెక్
- మన శంకర వరప్రసాద్ గారు’తో మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిసారిగా సినిమాలపై జరుగుతున్న డిజిటల్ మానిప్యులేషన్, ఆన్‌లైన్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే దిశగా కీలక అడుగు పడింది. కోర్టు ఆదేశాల మేరకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో రేటింగ్స్, రివ్యూలను చట్టబద్ధంగా నియంత్రించేలా చర్యలు చేపట్టారు. దాంతో నిజమైన ప్రేక్షకుల తీర్పుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, కావాలని చేసే దుష్ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేని వినూత్న నిర్ణయంగా సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలి కాలంలో సినిమాలపై కృత్రిమ రివ్యూలు, బాట్స్, అజెండాతో నడిచే నెగటివ్ క్యాంపెయిన్లు పెరిగిపోయాయి. సినిమా విడుదలైన క్షణాల్లోనే నెగటివ్ టాక్‌ను వ్యాప్తి చేయడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాల భవిష్యత్తు కొందరి స్వార్థపూరిత ఎజెండాలతో బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ప్రేక్షకుల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాకుండా మొత్తం క్రియేటివ్ ఎకోసిస్టమ్‌కు రక్షణ కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశం.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమా కోసం కోర్టు మద్దతుతో అమలైన ఈ డిజిటల్ సేఫ్‌గార్డ్స్.. భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది. ఇది నైతికమైన డిజిటల్ ప్రవర్తనకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు. ఈ విప్లవాత్మక చర్యకు బ్లాక్‌బిగ్, ఐప్లెక్స్ సంస్థలు ముందుండి నడిచాయి. భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ సహకారం అందించడం విశేషం.
Also Read: Anil Ravipudi: వరసగా తొమ్మిదో విజయం.. ‘సంక్రాంతి’ మొనగాడు అనిల్ రావిపూడి!
ఈ సాహసోపేతమైన నిర్ణయంకు మద్దతు ఇచ్చిన షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు టాలీవుడ్ పరిశ్రమ తరఫున ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ సబోటేజ్‌కు చోటు లేకుండా, నిజమైన ప్రేక్షకుల తీర్పే సినిమాలకు ప్రమాణమవ్వాలన్న బలమైన సందేశాన్ని ఇస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ కాలానికి అనుగుణంగా మారుతూ.. సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాకుండా బాధ్యతాయుతమైన డిజిటల్ పాలనను అమలు చేస్తోందని ఇది తెలియజేస్తోంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!