తెలంగాణంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ రె’ఢీ’.. వచ్చే నెలలో షెడ్యూల్ ఇదే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పెండింగ్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేస్తూ… నిరుపేదలకు విడతల వారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అందజేస్తూ… ప్రజల్లో ఉండేలా ప్రయత్నిస్తోంది. ఇక.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. ఇక… ఎన్నికల శంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో… రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహించాలని యోచిస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్‌లో కమలం పార్టీ 30 నుంచి 40 సమావేశాలు నిర్వహించబోతోంది. ఆ సమావేశాలకు పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి వివరించాలని ప్లాన్ చేసింది. అంతేకాదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించబోతున్నారు. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు.
అనేక అవమానాలు ఎదుర్కొని ఎదిగిన మహాకవి జాషువా
వైసీపీ కేంద్ర కార్యాలయంలో కవికోకిల గుఱ్ఱం జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడకల్లో జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. గుఱ్ఱం జాషువా జంయతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా చేపట్టాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనేక అవమానాలు ఎదుర్కొని ఎదిగిన మహాకావి జాషువా అని ఆయన కొనియాడారు. జాషువా ఆశయాలు, స్ఫూర్తిని జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
గిరిజనులకు, గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ దే
ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో పాటు,ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్‌కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లాను ఇచ్చారు.. ఈరోజు జిల్లాకు మెడికల్ కాలేజీ ని మంజూరు చేసారన్నారు. 1100 మంది దళిత బంధు ఇస్తున్నాం, 3000 మందికి గృహలక్షి పథకంతో పాటు 5000 మందికి ప్రత్యక్ష్యంగా లబ్ది చేకూరుతుందన్నారు. ఏటూరునాగారం లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, 7800 కుటుంబాలకి 14000 పట్టాలి ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు.
కేక పుట్టించిన కోకాపేట, బుద్వేల్ భూముల వేలం.. రూ. 6.5 కోట్ల ఆదాయం
హైదరాబాద్‌లోని కోకాపేట్, బుద్వేల్‌లో రికార్డు స్థాయిలో భూముల ధర హెచ్‌ఎండీఏకు చేరింది. ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా రికార్డు సృష్టించడంతో కోకాపేట్, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు దాదాపు 7 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కోకాపేట్ మరియు బుద్వేల్ రెండింటిలోనూ బిడ్డర్లు నిర్ణీత చెల్లింపు షెడ్యూల్ ప్రకారం తమ చెల్లింపులను వెంటనే పూర్తి చేశారని HMDA తెలిపింది. ఆగస్టు 3న కోకాపేటలో మొత్తం 45.33 ఎకరాల్లోని 7 ప్లాట్ల ఈ-వేలంలో రూ.3 వేల 319.60 కోట్లు.. సగటున ఎకరాకు 73.23 కోట్లు వచ్చినట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. ఎకరాకు 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఆగస్టు 10న బుద్వేల్‌లో 100.01 ఎకరాలను హెచ్‌ఎండీఏ వేలం వేయగా.. దీని ద్వారా 3 వేల 625.73 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రెండు చోట్లా భూముల విక్రయం ద్వారా హెచ్‌ఎండీఏకు 6,945.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రాజమండ్రి గోదావరిలో కోలాహలంగా గణేశ్ నిమజ్జనాలు
రాజమండ్రి వద్ద గోదావరిలో గణేష్ నిమజ్జనాలు కన్నుల పండుగగా సాగుతుంది. గోదావరి బండ్ ఇసుక రేవు వద్ద క్రేన్లు, ప్రత్యేక పంట్లు ఏర్పాటు చేసి రాజమండ్రి నలుమూలల నుండి వస్తున్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది పంటుపై గణేష్ విగ్రహాలను గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్న దృశ్యాలను వందలాదిగా తరలి వస్తున్న భక్తులు గట్టుకు నుండి తిలకిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోదావరిలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
బాసూ మీరు మ..మ..మాస్.. ఫుల్ జోష్ లో డ్యాన్స్ ఇరగ దీసిన పోలీసులు
హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు సందడిగా మారింది. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది. ఖైరతాబాద్ గణేష్ ఎదుట భక్తులతో పాటు పోలీసులు కూడా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. భక్తులతో కలిసి తీన్ మార్ స్టెప్పులు వేస్తూ అందరిని ఆకర్షించారు. పోలీసులు అందరూ ప్రజలతో మమేకమై డ్యాన్సుల చేస్తుంటే అక్కడి వచ్చిన వారందరూ ఆశక్తిగా పోలీసులు చేస్తున్న డ్యాన్స్ ను ఆనందంగా తలికించారు. పోలీసులు ఫుల్ జోస్ లో తీన్ మార్ డబ్బులకు స్టెప్పులు వేస్తూ ఆనందంగా గడిపారు. పోలీసులను చూసిన అక్కడి జనం బాసూ మీరు మ..మ.. మాస్ పోలీస్.. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విజిల్స్ వేస్తూ పోలీసులకు ఉత్సాహాన్ని నింపిన తీరు ఆహ్లాద వాతావరణం నింపింది.
ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు ఔట్
వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లు ప్రారంభానికి ఇంకెంతో సమయం లేదు. అయితే ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచకప్ కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుండి పూర్తిగా కోలుకోలేక మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు ఆల్ రౌండర్ అష్టన్ అగర్. అయితే ప్రపంచకప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే వారు మార్పులు చేయడానికి కేవలం ఇవాళ ఒక్కరోజు సమయం మాత్రమే మిగిలి ఉంది.
గత కొన్నిరోజులుగా గాయం కారణంగా బాధ పడుతున్న అష్టన్ అగర్.. ప్రపంచ కప్ వరకు ఫిట్ అవుతాడని భావించారు. అయితే ఇంకా గాయం తగ్గకపోవడంతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాడు. ఈ కీలక ఆటగాడు జట్టులో లేకపోవడం కంగారులకు పెద్ద సమస్యే.. ఎందుకంటే అతను చాలాసార్లు మ్యాచ్ విన్నర్ పాత్రను పోషించాడు. అయితే ఇప్పుడు జట్టులో లేకపోవడంతో మరో ఆటగాడి కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. అతని స్థానంలో భారత సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా 15 మంది ప్రపంచ కప్ జట్టులో చేరనున్నారు. భారత్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంఘ చివరి మ్యాచ్‌లో ఆడాడు.
చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి
చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలతోనే సీఐడీ చంద్రబాను అరెస్ట్ చేసిందన్నారు. ఓటులకు కూడా పూర్తి వివరాలు సమర్పించడంతోనే బెయిల్ కు అవకాశం లేకుండా పోతోందని, చంద్రబాబు హయాంలో జరిగిన. స్కాం లు ఒక్కోటి బయటకు వస్తున్నాయన్నారు. ఆయనకు 23 నెంబర్ కలిసి వస్తోందని, ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు 23 సీట్లు వచ్చాయని, జైలుకు వెళ్లిన తేదీ కూడా 23 అని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతల సైలెంట్ గా ఉంటే వైసీపీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువగా ఉందన్నారు.
ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్.. స్వదేశానికి కెప్టెన్ బావుమా
ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన దేశానికి తిరిగి వెళ్లాడు. మీడియా కథనాల ప్రకారం.. కుటుంబ కారణాల వల్ల బావుమా ఇంటికి తిరిగి వెళ్లాడని పేర్కొన్నాయి. అయితే ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికా.. సెప్టెంబర్ 29, అక్టోబర్ 2 న ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టెంబా బావుమా అందుబాటులో ఉండడు.
అయితే మ్యాచ్ లు ప్రారంభానికి ముందు టెంబా బావుమా ఇండియాకు తిరిగి వస్తాడని టీమ్ మేనేజ్ మెంట్ చెబుతుంది. సౌతాఫ్రికా తొలి మ్యాచ్ శ్రీలంకతో జరుగనుంది. అక్టోబర్ 7న మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 12న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరోవైపు టెంబా బావుమా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడంతో ఐదాన్ మార్క్రామ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
గుర్రపు స్వారీలో భారత్‌కు కాంస్య పతకం
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత ఆటగాడు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. గుర్రపు స్వారీ డ్రెస్సేజ్ (వ్యక్తిగత) ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని సాధించాడు. ఈ ఈవెంట్‌లో మలేషియా క్రీడాకారిణి 75.780 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. హాంకాంగ్ ప్లేయర్ 73.450 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన అనుష్క అగర్వాల్ 73.030 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆసియా క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు గుర్రపు స్వారీలో వ్యక్తిగత దుస్తుల్లో భారత్‌కు ఇదే తొలి పతకం. అంతకుముందు 5వ రోజు భారత్‌కు చెందిన రోషిబినా దేవి వుషులో రజత పతకాన్ని గెలుచుకోవడంతో పాటు షూటింగ్‌లో మరో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగలిగింది. ఉషు స్వర్ణ పతక పోరులో మహిళల 60 కిలోల వెయిట్ కేటగిరీ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన రోషిబినా దేవి చైనా క్రీడాకారిణి చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
రాజావారు రాణిగారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయిన హీరో కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారాడు. ఇక కిరణ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోకుండా కష్టపడుతున్నాడు. ఇక వినరో భాగ్యం విష్ణుకథ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్.. ప్రస్తుతం రూల్స్ రంజన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పటినుంచో కిరణ్.. ఒక సొంతిల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాడు. తాజాగా ఆ ఆశను కుర్ర హీరో నెరవేర్చుకున్నాడు. సొంత ఊరిలో ఒక సొంత ఇల్లును కట్టి గృహప్రవేశం కూడా గ్రాండ్ గా జరిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను కిరణ్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇక ఈ వీడియోలో కిరణ్ తో పాటు తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. కిరణ్, హీరోయిన్ రహస్య గోరఖ్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు బయట కనిపించారు. రాజావారు రాణిగారు చిత్ర సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యిందని తెలుస్తోంది. ఇక తాజాగా కిరణ్ ఇంటి గృహప్రవేశం వేడుకలో ఈ చిన్నది మెరిసింది. కుటుంబ సభ్యులతో కలిసి పూలు కడుతూ కనిపించింది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందని, కిరణ్ కుటుంబ సబ్యులకు కూడా రహస్య నచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.