రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది.
మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్‌కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్‌లను తెలిపారు.
2024లో ఏకకాలంలో ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని లా ప్యానెల్ విశ్వసిస్తోందని వర్గాలు తెలిపాయి.
చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌తో చరిత్ర సృష్టించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ఇప్పుడు శుక్రుడిపై దృష్టి పెట్టింది.
నానబెట్టిన వేరుశెనగలు తినడం ద్వారా మానవుని ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు ఉదయాన్నే నానబెట్టిన గింజలు, మొలకలు తింటారు. అవి తినడం వల్ల ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా పరిగణిస్తారు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు భారత్‌తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. భారత కూటమితో తమ పార్టీ విడిపోదని స్పష్టం చేశారు.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ రికార్డులు చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌ల్లో 65.20 సగటుతో 987 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. పాకిస్తాన్‌పై 140 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు రోహిత్ శర్మ.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా అక్షర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు.