పట్టణాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇళ్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చౌకగా గృహ రుణాలు అందించే పథకాన్ని తీసుకురానుంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయడానికి దగ్గరగా ఉందని, దీనికి సంబంధించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
గతేడాది గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తాను కాదని గుజరాత్ ప్రజలేనని సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ తీవ్ర ప్రచారం తర్వాత, ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల వాతావరణాన్ని మార్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదే నినాదం ఇచ్చారు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన స్క్వాష్ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్లో మలేషియా జట్టును 2-0తో ఓడించి ఫైనల్కు చేరుకుంది.
వన్డే ప్రపంచ కప్లో భాగంగా హైదరాబాద్లో న్యూజిలాండ్తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ చేశాడు. 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ సెంచరీ ప్రపంచ కప్కు ముందు ఎంతో బలాన్ని ఇచ్చింది.
స్థానికంగా ఆజాద్పూర్ మండి అని పిలువబడే ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)పై లా కమిషన్ కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఇందులో స్వలింగ మినహాయినంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో పురుషుడు, స్త్రీ మధ్య వివాహాలు ఉంటాయని, స్వలింగ వివాహాలు యూసీసీ పరిధిలోకి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొ్న్నట్లు తెలుస్తోంది.
ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా.. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో మరో పతకం ఖాయమైంది. జోర్డాన్ క్రీడాకారిణి హనన్ నాసర్తో జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్లో నిఖత్ జరీన్ ఏకపక్షంగా ఆడింది. ఈ విజయంతో నిఖత్.. 2024లో పారిస్లో జరిగే ఒలింపిక్ క్రీడల కోటాను దక్కించుకుంది.
పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సు వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లా కమిషన్ కీలక సూచనలు చేసింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లేనని, 16కి తగ్గించవద్దని లా కమిషన్ కేంద్రానికి సూచించింది.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పుట్టుకతో వచ్చే గుండె లోపాలను ఎదుర్కొని విజేతలుగా నిలిచిన లిటిల్ ఛాంపియన్స్తో కలిసి రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వేడుకలు జరిపింది.