బైక్ కొనివ్వలేదని తాళాలు మింగిన యువకుడు.. చివరకు.. చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్నపాటి విషయాలకు మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఇనుప తాళాలు మింగిన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగింది. తనకు బైక్ కావాలని ఇంట్లో వాళ్లతో గొడవపడి నాలుగు తాళాలను మింగేశాడు. తాళాలు మింగిన యువకుడు భవాని ప్రసాద్‌కు తీవ్ర కడుపు…
యువతులకు వారికి నచ్చిన వాటిని ఇస్తానని ఆశలు రేపి అత్యాచారాలకు పాల్పడిన నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో చోటుచేసుకుంది. సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
వన్ సైడ్ లవ్.. అది ఫలించకపోవడంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని కక్ష పెంచుకున్నాడు ఆ ప్రేమోన్మాది. తన ప్రేమను నిరాకరించిందని మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా కత్తితో 13 సార్లు పొడిచాడు. గాయాలతో రక్తపు మడుగులో జీవచ్ఛవంలా ఆ యువతి పడిపోవడంతో ఆమె చనిపోయింది అనుకున్న ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు.
ఓ దొంగను పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసిన ఘటన రాజస్థాన్‌లోని బుండిలో చోటు చేసుకుంది. ఆ ఊర్లో ఉన్న పొలాల వద్ద నుంచి దొంగ కేబుల్స్ ఎత్తుకెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని దొరకబట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సంజయ్ మల్హోత్రా కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా భారత ప్రభుత్వ రెవెన్యూ విభాగానికి కార్యదర్శిగా పని చేశారు. కాగా.. సంజయ్ మల్హోత్రాను దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదించారు. శక్తికాంత్ దాస్ లాగానే మల్హోత్రా కూడా IAS అధికారి. అతను 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్.
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చాలా లాభపడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది.
టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ (ICC) షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బందాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ మహిళ పదునైన వస్తువుతో అతని ప్రైవేట్ భాగాలను కత్తిరించింది. ఆ వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై దాడికి యత్నించడంతో తాను ఈ దారుణానికి ఒడిగట్టానని మహిళ పేర్కొంది.
బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై తన స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. తనకు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం చేసిన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు తెలిపింది.