Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devdutt Padikkal Rare Test Record: టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో మూడో స్థానంలో 200కు పైగా పరుగులు చేసిన భారత బ్యాటర్లలో మూడో ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రాణించడంతో పడిక్కల్ ఈ రికార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 230 బంతుల్లో 167 పరుగులు చేసిన పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్‌లో 75 బంతుల్లో 44 రన్స్ చేశాడు. గాలె టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 211 పరుగులు చేశాడు.
భారత మాజీ టెస్టు బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా కూడా ఈ రికార్డును అందుకోలేకపోయాడు. అలాంటిది దేవదత్ పడిక్కల్ కెరీర్ ఆరంభంలోనే ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. విదేశీ గడ్డపై టెస్టులో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ద్రవిడ్ ఏకంగా ఐదుసార్లు ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇప్పుడు ఈ రికార్డు పడిక్కల్ టెస్టు కెరీర్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
Also Read
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
- 2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం కావడంతో దేవదత్ పడిక్కల్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని అతడు అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. గాలె టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ (167) చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక రన్స్ చేసి టెస్టు జట్టులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. తన మూడో టెస్టులోనే తొలి సెంచరీ సాధించిన పడిక్కల్.. విదేశీ టెస్టులో నంబర్-3 స్థానంలో 150కు పైగా పరుగులు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం శ్రీలంకతో తొలి టెస్టులో పడిక్కల్ ప్రదర్శన భారత జట్టుకు మాత్రమే కాకుండా అతడి వ్యక్తిగత కెరీర్‌కు కూడా కీలకంగా మారింది. దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా ఈ ఘనతను అందుకోలేకపోవడం విశేషం.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?