Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పాతబస్తీలోని ఫతే దర్వాజా ప్రాంతంలో ఒక భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటనలో ఒక మూడు అంతస్తుల భవనం ప్రమాదానికి గురైంది. భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, చూస్తుండగానే దట్టమైన పొగతో పాటు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ ఇంజిన్ల సహాయంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంటిలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణనష్టం తప్పడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. ప్రాథమిక వివరాల ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, ఎంత ఆస్తి నష్టం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!