Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌ను తన అంతిమ లక్ష్యంగా పేర్కొన్నారు. సాంకేతికంగా కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్లనే శ్రీలంకతో గాలేలో జరుగుతున్న మొదటి టెస్టులో రాణించగలిగానని తెలిపారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసిన పడిక్కల్.. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఆయన అద్భుత బ్యాటింగ్ వల్ల భారత్ ఈ మ్యాచ్‌లో విజయం వైపు అడుగులు వేసింది. రోజు ఆట ముగిసిన అనంతరం పడిక్కల్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తానని, దానికి తగ్గట్టుగానే తన టెక్నిక్స్ ను రూపొందించుకున్నానని వివరించారు.
పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి రెడ్ బాల్ క్రికెట్‌కు మారడం అంత సులభం కాదని పడిక్కల్ అభిప్రాయపడ్డారు. వైట్ బాల్ క్రికెట్లో కాస్త స్వేచ్ఛగా షాట్లు ఆడతానని, అదే రెడ్ బాల్ క్రికెట్‌కి వచ్చేసరికి చేతులను శరీరానికి దగ్గరగా ఉంచుకుంటూ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతిక మార్పులతో పాటు మానసిక దృక్పథంలో కూడా మార్పులు రావడం ఎంతో ముఖ్యమని చెప్పారు. నిలకడగా మ్యాచ్‌లు మారుతున్నప్పటికీ ఆ శైలికి త్వరగా అలవాటు పడేలా తన ఆటను మెరుగుపరుచుకున్నానని పేర్కొన్నారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ గాయపడటంతో పడిక్కల్‌కు ఆడే అవకాశం లభించింది. మూడో స్థానంలో తన భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం లేదని, మైదానంలోకి దిగిన ప్రతిసారి పరుగులు చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మనం సరిగ్గా రాణించకపోతే మన స్థానంపై నిరంతరం ప్రశ్నలు వస్తూనే ఉంటాయని, అందువల్ల తనకు లభించిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి సారిస్తున్నానని వ్యాఖ్యానించారు. నిలకడగా పరుగులు సాధిస్తే జట్టులో ఎక్కువ కాలం కొనసాగవచ్చనే నమ్మకం తనకు ఉందని పడిక్కల్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!