దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజౌరీ గార్డెన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న జంగిల్ జంబూర్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు.
సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనలలో రెండు స్పైస్‌జెట్ విమానాలను దారి మళ్లించారు. ఒకటి షిల్లాంగ్‌కు, మరొక విమానాన్ని కొచ్చికి సాంకేతిక సమస్యల కారణంగా డైవర్ట్ చేశారు విమానాయాన అధికారులు. కాగా.. అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమేమీ లేదు.
ఫైనల్లో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. ఆసియాకప్ విజేతగా బంగ్లాదేశ్ దివారం నాడు జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్‌ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కాపాడుకుంది. 9వ ట్రోఫీని గెలుచుకోవాలన్న భారత్ కల నెరవేరలేకపోయింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికి ఎనిమిది సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. బంగ్లాదేశ్…
అమానుషం.. మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు.. మానవత్వం మంటగలుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వృద్ధులపై విచక్షణారహితంగా కొందరు దాడులు చేస్తున్నారు. ఆస్తుల కోసం కొందరు, భారమై మరికొందరు వృద్ధులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ కోడలు తన మామను వృద్ధుడని కూడా చూడకుండా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్ లో కూర్చున్న మామ వద్దకు పరుగున వచ్చిన కోడలు చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం…
రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కి డేట్ ఫిక్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రష్మి తన సత్తా చాటుతుంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా యానిమల్, పుష్ప 2 సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్లు చైర్ కార్స్‌తో నడుస్తున్నాయి. కాగా.. స్లీపర్ వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. స్లీపర్ వందే భారత్ సహాయంతో ప్రయాణీకులు హాయిగా పడుకుని నిద్రపోతూ చాలా దూరం ప్రయాణించవచ్చు. ఈ క్రమంలో.. రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్త లాంటిది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రాక్‌పై ట్రయల్‌కు సిద్ధంగా ఉంది. ఈ రైలు ట్రయల్ రన్ త్వరలో ప్రారంభం కానుంది.
రాహుల్ గాంధీ ‘దేశద్రోహి’,‘సోరోస్ ఏజెంట్’.. దూషించిన బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్… లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు…
భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా ఆహారంలో నూనెను వాడతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
చలికాలం వచ్చిదంటే ముఖ్యంగా వేధించే సమస్య పెదవులు పగలడం, కాళ్లు చేతులు పగులుతాయి. చలి కాలంలో అనేక రకాల సమస్యలు తరచుగా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తాయి. జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలే కాకుండా.. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఈ సీజన్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. శీతాకాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.. చలికాలంలో గాలిలో తేమ ఉండదు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అయితే.. వంటింట్లో ఉండే లవంగాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. లవంగాలను వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. లవంగాలు ఆహారానికి రుచితో పాటు అనేక వ్యాధులను నయం చేస్తాయి. రోజూ కేవలం 2 లవంగాలు నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.