దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30…
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని…
లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్మెంట్) మిజోరంలో విజయం సాధించింది. 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో అధికార MNF (మిజో నేషనల్ ఫ్రంట్)ను అధికారం నుండి తొలగించి.. జడ్పీఎం అధికారం చేపట్టనుంది. కాగా.. మిజోరాం నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లాల్దుహోమ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
చండీగఢ్లోని అమృత్సర్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని 'మోస్ట్ వాంటెడ్' నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్బీర్ సింగ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించాడు. అతని సహచరుడు పరమజీత్ సింగ్ అలియాస్ ధాదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేరం చేసిన వాళ్లకు ఏదో రోజు శిక్ష పడి తీరుతుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ మానవ మృగం ఇంకిత జ్ఞానం లేకుండా చిన్న పాప అని కూడా చూడ కుండా ఓ మైనర్ బాలిక పైన విచక్షణారహితంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.