ISRO: చంద్ర కక్ష్య నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్ మాడ్యూల్.. అరుదైన ప్రయోగంలో విజయం సాధించాం.. ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: భరత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-3. చంద్రుని దక్షణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యి ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత సాధించింది. కాగా చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని X వేదికగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ప్రకటించింది. చంద్రయాన్-3 కి సంబంధించిన తాజా అప్‌డేట్ ను X లో ట్వీటీ చేసింది. ఆ ట్వీట్ లో ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చమని.. చంద్రుడి కక్ష్య లో ఉన్న మాడ్యూల్ ను భూకక్ష్యలోకి తీసుకొచ్చి.. అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది.
Read also:Cyclone Michuang: ఆత్మకూరు బస్టాండ్‌లో మోటార్లు పెట్టి నీటిని తోడుతున్న అధికారులు!
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇందుకు గాను ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ వినియోగించినట్టు తెలిపింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ని అంతరిక్షంలో ప్రవేశ పెట్టేందుకు ఈ ఏడాది జులై 14వ తేదీన శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ను ప్రయోగించారు. కాగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది. అలానే ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు అందించింది. కాగా చంద్రుని పైన 14 రోజులపాటు ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు అందించిన ప్రజ్ఞాన్ రోవర్ ఆపైన చంద్రుడిపైన ఏర్పడిన చీకటి కారణంగా నిద్రావస్థలోకి వెళ్ళింది. ఆ తరువాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్న విషయం తెలిసిందే.
Chandrayaan-3 Mission:
Ch-3's Propulsion Module (PM) takes a successful detour!
In another unique experiment, the PM is brought from Lunar orbit to Earth’s orbit.
An orbit-raising maneuver and a Trans-Earth injection maneuver placed PM in an Earth-bound orbit.… pic.twitter.com/qGNBhXrwff
— ISRO (@isro) December 5, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!