ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలకు నిప్పంటుకుని అందులో ఉన్న ముగ్గురు చిన్నారులు మృత్యువాత చెందారు. ఈ ఘటన జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామంలో జరిగింది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం హత్యా ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడు మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకండా బాధితుడిపై దాడికి దిగాడు. కాగా.. కొడవలితో దాడి చేస్తున్నప్పుడు స్థానికులు ఆపకుండా, ఫోన్లలో ఈ దాడిని మొత్తం వీడియో తీశారు.
డిల్లీకి చెందిన కిరణ్‌వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకున్నారు. ఇందుకుగాను అతను పాదయాత్ర చేస్తూ ప్రజల్లో రక్తదానం పైన ఆవాహన కల్పించే సభలను ఏర్పాటు చేసాడు.
నిన్న వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, కేవలం ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పంచుకోని కారణంగా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ఓటమి మాత్రమేనని.. ప్రజలది కాదు అని తెలిపారు.
మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మీటర్ అంతకు మించిన ఎత్తున సముద్రపు అలలు విరుచుకుపడి.. ఐదు కిలోమీటర్ల ముందుకు సముద్రపు నీరు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెల్లూరుకు 170కి.మీ దూరంలో కొనసాగుతున్న మిచౌంగ్.. రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది.
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.