Anantapur: అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం పేరుతో నమ్మించి నమ్మిన స్నేహితుడి ప్రాణాలనే తీసాడు ఓ కిరాతకుడు. వివరాలలోకి వెళ్తే.. అనంతపురం లోని మున్నానగర్ ప్రాంతానికి చెందిన అలీ అనే యువకుడు గత నెల 27వ తేదీన ఇంట్లో బెంగుళూరు వెళ్లుతున్నానని చెప్పి వెళ్ళాడు. అయితే ఆ తరువాత అలీ ఫోన్ నుండి ఎలాంటి కాల్స్ రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అనంతపురం నగరంలోని వన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూసాయి. అలీగా తన స్నేహితుడే హత్య చేశారు.
Read also:Bhubaneswar : చరిత్ర సృష్టించిన మనీషా పాధి.. దేశంలోనే మొదటి మహిళా ఏడీసీ
అనంతరం ఆనవాళ్లు దొరకకుండా మృతదేహాన్ని దహనం చేసాడు. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ హత్య బయట పడింది. దీనితో అలీని నమ్మించి స్నేహితుడే హత్య చేసినట్లు పోలీసుల నిర్థారణకు వచ్చారు. ఈ నేపాహ్యంలో నిందితుడు హత్యా నేరం నుండి తప్పించుకోవడానికి దృశ్యం సినిమా కథ అల్లినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నిందితుడు పోలీసుల ఆధీనంలో ఉన్నారు. నిందితుడు అలీని హత్య చేయడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి విచారిస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలు తెలియాల్సి ఉంది. అలీ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.