bus accident: మరికొద్ది సమయంలో గమ్యానికి చేరుకుంటామని ఆ బస్సు లోని ప్రయాణికులు ధైర్యంగా నిద్రపోతున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన వాళ్ళ జీవితాలను తారుమారు చేసింది. నిద్రలో ఉన్న వాళ్ళు నిద్ర లోనే కన్నుమూసేలా ఆ బస్సు ఓ చెట్టుకు డీ కొట్టింది. ఈ ఘటన థాయ్‌లాండ్ లో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. సోమవారం అర్థరాత్రి థాయ్‌లాండ్ లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో ఓ బస్సు అదుపు తప్పి సమీపం లోని చెట్టును ఢీకొని రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ఘటనలో బస్సు లోని 14 మంది ప్రయాణికులు మరణించగా.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Read also:Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. కృష్ణా జిల్లాలో భారీ నష్టం
కాగా ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అతి కష్టం మీద బస్సు శిధిలాలలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలానే మృతదేహాలను పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుకునేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.