ఈ ఏడాది ప్రారంభంలో జాతి ఘర్షణలతో మణిపూర్ అట్టుడికింది. అయితే కొన్నాళ్లుగా సద్దుమణిగిన ఘర్షణలు మళ్ళీ మొదలైయ్యాయి. తాజాగా ఇరు వర్గాల మధ్య కాల్పుల జల్లులు కురుసాయి. ఈ కాల్పుల్లో పదిమందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. వివరాల లోకి వెళ్తే.. సోమవారం మయన్మార్‌కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో కాల్పులు జరిపింది. దీనితో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతమంతా ఒక్కసారిగా కాల్పుల మోత దద్దరిల్లింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ.. మయన్మార్‌కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో దాడికి పాల్పడిందని.. అనంతరం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని.. ఈ గతంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
Read also:Salaar: 150 మిలియన్ వ్యూస్… టచ్ చేసే దమ్ముందా? లేక మళ్లీ ప్రభాస్ ట్రై చేయాలా?
అలానే వారెవరూ స్థానికులు కారని.. కాగా ఈ ఘటన పైన విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీసినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది మే లో మైథేయి మరియు కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణలు చెలరేగిన సంగతి అందరికి సుపరిచితమే. కాగా ఆ ఘటనలో దాదాపు 182 మంది చనిపోగా.. దాదాపు 50,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ దుర్ఘటన నుండి కోలుకోక ముందే మళ్ళీ జాతి ఘర్షణలు మొదలైయ్యాయి. ఈ ఘర్షణలు మణిపూర్ లో మరణ మృదంగం మోగింది.