దేశీయ స్టాక్ మార్కెట్‌లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో.. ఈరోజు సెన్సెక్స్ 69,381.31 పాయింట్ల వద్ద.. నిఫ్టీ రికార్డు స్థాయిలో 20,864.05 పాయింట్ల వద్ద ముగిశాయి.
Vishnu Vishal : వరదల్లో చిక్కుకున్న తమిళ హీరో.. సాయం చేసిన రెస్క్యూ టీం..
కాగా.. బ్యాంక్ నిఫ్టీ 1.52 శాతం పెరిగింది. పీఎస్‌యూ బ్యాంక్ కూడా 1.63 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 1.45 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ, మీడియా, రియల్టీ నష్టాల్లో ఉన్నాయి. తొలిసారిగా.. సెన్సెక్స్ 69000 దాటింది. నిఫ్టీ కూడా ఈ రోజు ట్రేడింగ్‌ను కొత్త ఆల్ టైమ్ హై లెవెల్ 20808తో ప్రారంభించింది. ఈరోజు సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 69168 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ దాని మునుపటి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 68918.22 ను అధిగమించి కొత్త రికార్డును సృష్టించింది. NSE బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 కూడా చరిత్ర సృష్టించి 20702కి చేరుకుంది. దీంతో ఈరోజు రికార్డులు కొల్లగొట్టాయి.
Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే..
ఇదిలా ఉంటే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ ఇప్పటికీ నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.2658.90కి చేరింది. అదానీ పోర్ట్స్‌లో దాదాపు 4 శాతం పెరుగుదల ఉంది. ఇప్పుడు రూ.913.40కి చేరింది. ఇవే కాకుండా నిఫ్టీ టాప్ గెయినర్ల జాబితాలో బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉన్నాయి.