నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ 67వ వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గందర్బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ట్యాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
మిచౌంగ్ తుపాన్ తో చెన్నై అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాల ధాటికి నగరంలో వరదలు ముంచెత్తాయి. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో చెన్నై వాసులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేయూత అందిస్తున్నారు. తాజాగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన అమాయక బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక ముఖం, ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా కెప్టెన్ డాక్టర్ గీతిక కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన గీతికా కౌల్ రికార్డులకెక్కారు. అక్కడ యుద్ధ పాఠశాలలో కౌల్ కఠినమైన ఇండక్షన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని పోష్ కాలనీలో.. ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణలపై కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అయితే బాధితుడిని కొట్టిన వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి.
సౌదీ అరేబియా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఈరోజు భారత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియాను కలిశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడామన్నారు. అంతేకాకుండా.. హజ్ యాత్రను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించామని తెలిపారు.
రెడ్ మీ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు వర్చువల్ ఈవెంట్లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు.