సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా.. అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు. సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏజెన్సీలో చిన్న చినుకుపడితే చాలు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారిపోతాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. గర్భిణీలకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే పురిటినొప్పులతో ఆ రోడ్లను దాటి వెళ్లడం సాధ్యం కాదు.. అంతకుమించి అక్కడికి ఏ వాహనాలు రావు. ఒకవేళ వచ్చినా, అందులో కూరుకుపోవాల్సిందే.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి మళ్లీ పుంజుకుంటాం బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ముష్ఫికర్ రహీమ్ 'హ్యాండిల్డ్ ది బాల్' కారణంగా ఔట్ అయ్యాడు. దీంతో.. టెస్టు క్రికెట్లో ఈ విధంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. క్రికెట్లో అతి తక్కువగా కనిపించే ఘటనల్లో ఇదొకటి.
రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో.. రేపు మధ్యహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్యరజన్ ప్రమాణం చేయించనున్నారు. ఇకపోతే.. రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం…
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా కొనసాగుతుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో.. టీ20 నెంబర్ వన్ బౌలర్ గా స్పిన్నర్ రవి బిష్ణోయ్ చోటు దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ ప్లేస్ లోకి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో రవి బిష్ణోయ్ 9 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇదిలా ఉంటే.. టీ20 నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా…
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగులు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు…
ఏపీలోని తుపాను ప్రభావిత పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
యూపీలో కాంగ్రెస్ జోరు కాస్త తగ్గింది. తెలంగాణలో పార్టీ విజయం తర్వాత యూపీలో ముస్లిం ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. భారత కూటమిని సజీవంగా ఉంచడానికి యూపీలో కాంగ్రెస్ అనేక రాజీలు చేయాల్సి రావచ్చు.. ఇది జరగకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఆ పార్టీ ఒంటరి అవుతుంది అని సమాజ్ వాద్ పార్టీ నేతలు చెబుతున్నారు.