చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నుంచి మిస్సింగ్ అయిన యువతి కేసు మిస్టరీగా మారింది. ఆమె కనిపించకుండా పోయి 50 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. హాస్టల్ నుంచి తన మామయ్య ఇంటికి అని బయలుదేరిన విద్యార్థిని మధ్యలోనే అదృశ్యం అయింది. మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినా నేటికీ జాడ దొరకకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.
ఐకియా అంటే ఫర్నీచర్ అమ్మకాలకు బ్రాండ్ అంబాసిడర్. హైదరాబాద్ ఐకియా కంపెనీలో కొనుగోలు చేసిన ఫర్నీచర్ ఐటమ్‌ను వ్యాన్లలో సరఫరా చేసి.. తిరుగు ప్రయాణంలో గచ్చిబౌలి ప్రాంతంలో పనిచేసే ఐటీ ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకొని వారికి గంజాయి సరఫరా చేస్తూ అదనపు ఆదాయం సంపాందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. వారిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలికాం నగర్, గచ్చిబౌలి ప్రాంతంలోని జీహెచ్ఎంసీ పార్కు ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం…
ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు వేటకుక్కలుగా మారి అందినకాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని.. ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని తెలిపారు.
ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ పై చర్చ జరిగింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చారు. ఈ క్రమంలో భూ భారతి బిల్లుకు శాసన సభ ఆమోదం కూడా తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. కొద్ది మందికి జరుగుతున్న నష్టం పేరు మీద ధరణి రద్దు చేసి భూ భారతి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. పదిరోజులు(ఈనెల 30) వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్ ఈ-ఫార్ములా కేసుపై సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీఏసీ మీటింగ్‌లో 9 అంశాలు ఇచ్చారు.. దీంట్లో ఈ ఫార్ములా గురించి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఫార్ములా ప్రతినిధి తనను కలిశారని.. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ ఫార్ములా ప్రతినిధిని తన ఇంట్లో కలిశానని అన్నారు.
హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని అన్నారు.