హీరో అల్లు అర్జున్ పై సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు.. డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. కొన్ని ఘటనలను ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ఒక లక్ష పై చిలుకు పోలీసుల కుటుంబాలు ఉన్నాయి.. ఒక్క బందోబస్తు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి.. అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి పేర్కొన్నారు. పోలీసులను నోటికి వచ్చిన్నట్టు కొందరు నటులు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. మేము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి.. అందరు పనులు చేసుకుంటే పోలీసు అధికారి రోడ్ల మీద ఉంటారని అన్నారు. సమాజం కోసం అతను అన్ని వేళలో అందుబాటులో ఉంటాడని విష్ణుమూర్తి తెలిపాడు.
Student Delivery: హాస్టల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని
అక్కడ ఇన్సిడెంట్ గురించి ఒక నటుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటే ముచ్చట చెప్తుతున్నాడు.. కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టే అధికారం ఉందా అని విష్ణుమూర్తి ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ కోర్టుకు తీసుకెళ్ళి బెయిల్ క్యాన్సిల్ చేపించే అవకాశం కూడా ఉందని తెలిపారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఒక్క ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం అనడం సరికాదని అన్నారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు.. బౌన్సర్లను పెట్టుకొని అందరినీ తోసేశారని విష్ణుమూర్తి తెలిపారు. నీ కళ్ళ ముందు ఇద్దరు కింద పడితే.. అందులో ఒక్కరూ చనిపోతే ఆగి చూడలేవా అని ప్రశ్నించారు. డే టైం అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగేదని చెప్పారు. పోలీసు వాళ్ళు వద్దు అన్న కూడా వచ్చాడన్నారు. అలాగే.. సినిమాలో పోలీస్ అధికారిని వ్యంగ్యంగా చూపించారు.. బట్టలు లేకుండా సీన్ ఉందని తెలిపారు. ఒక్క కుక్క పోలీసు అధికారిని గుర్తు పట్టదా.. సెన్సార్ బోర్డు కూడా గమనించాలని కోరారు. ఎలాంటి బాధ్యత లేదు కాబట్టి ఇలా వెళ్లావు.. ఒక్క పోలీసు అధికారి కూడా నీ దగ్గరకి రాకుండా చేస్తాం.. ఎలా బయటకి వెళ్తావో ఆలోచించుకో అని అన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకోరని విష్ణుమూర్తి హెచ్చరించారు.
Pushpa 2: పుష్ప సినిమా చూస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..
ప్రజా సమస్యలపై చర్చిచే అసెంబ్లీలో నీ గురించి మాట్లాడానికి ఒక్క గంట సమయం వృధా అయిందని విష్ణుమూర్తి అన్నారు. పోలీసు అధికారులు ఓపిక నశిస్తే ఎక్కడ ఏం కట్ చేయాలో అన్ని తమకు తెలుసన్నారు. దొంగతనం, లంగతనం చేసే సినిమాలు చేస్తున్నారు.. ఏం నేర్పిస్తున్నారు సమాజానికి అని ప్రశ్నించారు. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఎలా ఉంటుంది.. రైతు గురించి చేయండి, దేశ సైనికుల కోసం తియ్యండి సినిమాలని అన్నారు. ఎవ్వడైనా సరే తోలు తీస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. చనిపోయిన వారి గురించి చెప్పడం రాదు.. నువు ఎలా నటుడు అయ్యావని దుయ్యబట్టారు. ముందు నటన నేర్చుకో.. నువ్వు కామన్ వ్యక్తివి తీస్‌మార్ ఖాన్ కాదన్నారు. పోలీసు అధికారుల పై జాగ్రత్తగా మాట్లాడు.. లేకపోతే రీల్స్ కట్ అవుతాయన్నారు. పోలీసు కుటుంబాలపై, పోలీసులపై అనుచితంగా ప్రవర్తిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని విష్ణుమూర్తి తెలిపారు.