మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లవల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో.. ఆయన కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఆరోజు నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పిల్లాడి బ్రెయిన్ పని చేయడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీతేజను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిమ్స్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. 7 రోజుల పాటు సాగిన సమావేశాలు.. నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఎం తీరు గజ్జెల లాగు వేసుకొని కొరడాతో తనని తానే కొట్టుకున్నట్లు ఉందని విమర్శించారు. సీఎం కాబట్టి మైక్ దొరికింది అని మాట్లాడారు.. తమకు మాత్రం మైక్ ఇవ్వనివ్వలేదని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. శాసన సభ చరిత్రలో ఎప్పుడు చెప్పని విధంగా అబద్ధాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారు.. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పత్తి రైతులు ఎనిమిది నెలలు పంట పండిస్తారు.. పత్తి రైతులకు రెండో విడత రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
హాట్ హాట్గా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఈరోజుతో 7 రోజులు సమావేశాలు వాడీవేడిగా సాగాయి.
రవాణాశాఖలో డీటీసీలను జేటీసీలుగా, ఆర్టీవోలను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా డీటీసిలు, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే బీఆర్ఎస్ కాళ్లలో కట్టెలు పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తా అంటే వద్దు అంటారు.. ఫ్యూచర్ సిటీ వద్దు అంటారు.. రుణమాఫీ వద్దు అంటారు.. ఇండస్ట్రీ పెడతా అంటే వద్దు అంటారు.. ఏం చేయాలి మరి అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను నల్లమల నుండి వచ్చానని... ఇక్కడ తొక్కితే అక్కడికి పోయారు వాళ్ళు అని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం.. బీఆర్ఎస్సే కారణమని మండిపడ్డారు. తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు.. వాళ్ళు తెచ్చిన అప్పు 11.5 వడ్డీ అని అన్నారు. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటాం.. వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళని ఆరోపించారు.
సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని.. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.