న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్
రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. రామ్ చరణ్ సోలోగా నటించి నాలుగేళ్లు కావడంతో అభిమానులు తమ హీరో సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తు్న్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను బాగా పెంచాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్లను మూవీ మేకర్స్ ప్రారంభించారని తెలిసింది. సాధారణంగా తెలుగు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి.
మెల్‌బోర్న్ టెస్టు ముందు టీమిండియాకు కష్టాలు.. రోహిత్, రాహుల్ లకు గాయాలు.. టీమ్‌పై ప్రభావం పడనుందా?
మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే నాలుగో టెస్టుకు అత్యంత కీలకం కానుంది.
ప్రజల అదృశ్యం వెనుక భారత్ హస్తం ఉంది.. అక్కసు వెళ్లగక్కిన ముస్లిం దేశం
భారత దేశంపై మరోసారి బంగ్లాదేశ్ తాతాల్కిక ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. తాజాగా, బహిష్కృత ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రజలను బలవంతంగా అదృశ్యమైన ఘటనల వెనుక భారత్ హస్తం ఉందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఆరోపించింది. ఈ అదృశ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక, ప్రజలను బలవంతపు అదృశ్యాలలో భారతదేశ ప్రమేయం ఉందని ప్రభుత్వ వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్‌బాద్ సంస్థా కథనాలు ప్రచురించింది.
వీడి కక్కుర్తి తగలెయ్యా ! చనిపోయిన వ్యక్తి పింఛన్ కాజేసిన బీపీఎం..
పోస్టల్ శాఖ బీపీఎం అవినీతిని అధికారులు బట్ట బయలు చేశారు. మూడు నెలల నుంచి అధికారుల కళ్లుగప్పి మృతి చెందిన ఓ వ్యక్తి ఆసరా పింఛన్ డబ్బులు కాజేసిన పోస్టల్ శాఖ బీపీఎం అవినీతిని బయట పెట్టారు. ఈ ఘటన వాంకిడి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొమురం భీం జిల్లాలో వాంకిడి మండల కేంద్రానికి చెందిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి ఆగస్టు నెలలో మృతి చెందాడు. అయితే తన తల్లికి పెన్షన్ మంజూరు కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసారు. అయితే షేక్ మహబూబ్ అనే వ్యక్తిపై పింఛన్ డ్రా చేసినట్లు అధికారులు తెలుపడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. షేక్ మహబూబ్ అనే వ్యక్తి పేరిట జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నెలలకు సంబంధించిన మొత్తం 6048 రూపాయలు పింఛన్‌ను డ్రా చేసినట్టు మృతుడి కుటుంబ సభ్యులకు అధికారులు రికార్డులు చూపించారు. దీంతో విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తెనాలిలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు
క్రీడలను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా తెనాలిలో విశాలమైన క్రీడా స్టేడియంను నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ 1.76 ఎకరాల మునిసిపల్ భూమిని ఉపయోగించుకుంటుంది , ₹ 3 కోట్లు అంచనా వేయబడింది. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్ పూల్‌తో పాటు వాలీబాల్ , బాస్కెట్‌బాల్ కోర్టులు వంటి సౌకర్యాలు ఉంటాయి.
పీవీ సింధు వివాహ సన్నాహాలు షురూ.. రాఫెల్స్ హోటల్‌కు అతిథుల రాక ప్రారంభం
భారతదేశంలోని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని ఆమె ఈరోజు (ఆదివారం) రాఫెల్స్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు. సింధు, దత్త సాయి, వారి కుటుంబ సభ్యులు గురువారం ఉదయపూర్‌కు చేరుకున్నారు. ఈ వివాహానికి కేవలం 140 మంది అతిథులు మాత్రమే హాజరవుతారు, వీరి కోసం 100 హోటల్ గదులు బుక్ చేయబడ్డాయి. వేడుకల్లో భాగంగా శనివారం మెహందీ, సంగీత్ వేడుకను నిర్వహించారు, దీనికి ముందు జంటతో కూడిన ఫోటోషూట్ జరిగింది.
కూతురిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్.. స్కెచ్ వేసి హత్య చేసిన తల్లిదండ్రులు..
కని పెంచిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులు గా మార్చింది.. ఒక్కగానొక్క గారాల బిడ్డను మాయమాటలతో అపహరించుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు హతమర్చారు. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్య, కూతురుతో కలిసి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్నారు. ఏడో తరగతి చదువుకుంటోంది. అయితే తన కూతురుని కుమార్ అనే కుమార్ అనే ఆటో డ్రైవర్ ట్రాప్ చేశాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి బాలికను కిడ్నాప్ చేశాడు. యూసఫ్‌గూడలోని ఓ గదిలో నిర్భంధించి లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్లిందో తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ దొరకలేదు. అయితే బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని ఆటోడ్రైవర్ ను హత మార్చాలని బాలిక తల్లిదండ్రలు స్కెచ్ వేశారు. స్నాప్ చాట్ ద్వారా భార్యతో కలిసి హనీ ట్రాప్ చేశారు. ఆటో డ్రైవర్ కుమార్ ను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి కూతురు గురించి చెప్పమని అడిగారు.
బంగాళదుంపల బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం.. రూ.30 లక్షల మద్యం స్వాధీనం
బిహార్‌లో ముజఫర్‌పూర్ పోలీస్ విభాగం మద్యం మాఫియాలపై భారీ చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మాఫియాలు పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారి అక్రమ మద్యం రవాణాను నివారించారు. పంజాబ్‌లో తయారైన దాదాపు రూ. 30 లక్షల విలువైన అక్రమ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం స్మగ్లర్లు తమ మద్యం తరలింపును గోప్యంగా చేయడానికి చాకచక్యంగా పద్ధతులు అనుసరించారు. మద్యం సీసాలను బంగాళదుంపల బోరాలలో దాచిపెట్టి ట్రక్ ద్వారా తరలించారు. అయితే, పట్నా మద్య నిషేధ విభాగానికి సమాచారం అందడంతో.. ముజఫర్‌పూర్‌లోని సదర్, మనియారి, తుర్కి పోలీస్ స్టేషన్ల బృందాలు సంయుక్తంగా ఈ దాడిని చేపట్టాయి. దీని ఫలితంగా, సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిఘ్రా NH-28 వద్ద ట్రక్‌ను ఆపి తనిఖీ చేసి అక్రమ మద్యం పట్టుకున్నారు.