హీరో అల్లు అర్జున్ పై సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు.. డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. కొన్ని ఘటనలను ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు.
అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్‌లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు.. రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు…
న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. రామ్ చరణ్ సోలోగా నటించి…
నేడు మెదక్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు మెదక్‌కు గవర్నర్. మెదక్ కెథెడ్రల్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్న జిష్ణుదేవ్ వర్మ. అనంతరం కొల్చారంలోని గురుకుల విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి. విద్యార్థినులతో కలిసి లంచ్ చేసి ఆహారాన్ని పరిశీలించనున్న గవర్నర్. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్న గవర్నర్. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,500 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో నిన్న రాత్రి డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1కోటి 15 లక్షల విలువైన 1 కేజీ ఎండిఎంఏ, 4 మొబైల్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే అల్లు అర్జున్ స్పందించారని అన్నారు.
చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడంలో తలెత్తుతున్న ఇబ్బందులు, న్యాయపరమైన అంశాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై న్యాయ నిపుణులతో హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవానికి కృషి చేస్తున్న హైడ్రాకు న్యాయ సలహాలు అందించడానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయ నిపుణులు తెలిపారు.
తన సొంత ఖర్చులతో రేవతి పిల్లలిద్దరికీ చదువులు చెప్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈనెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్య థియేటర్‌కి రేవతి, భాస్కర్, వారి పిల్లలు శ్రీ తేజ, సాన్విక వెళ్ళారని అన్నారు.
మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఈనెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఈటల తెలిపారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వేస్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి.. నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుందని అన్నారు.