Attack on Allu Arjun’s house: హైదరాబాద్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ యత్నించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. అల్లు అర్జున్ ఇంట్లో పూల కుండీలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా.. ఇంటిపైకి టమాటాలు విసిరారు. దీంతో.. ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read Also: Hyderabad: సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సంచలన వీడియో విడుదల..
మరోవైపు.. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేసిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన విద్యార్థులను అడ్డుకున్నారు. రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ అని నినాదాలు చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు బయట కనిపించలేదు.