తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు.
ఈ వారం ఉగాది రోజున ఐదు సినిమాలు విడుదల కాబోతుండగా, శుక్రవారం మరో మూడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అనువాద చిత్రాలతో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్న వీటిలో దేనికి ప్రేక్షకుడు పట్టం కడతాడో చూడాలి.
Naveen Reddy: సినీ నటుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పని చేసిన నవీన్ రెడ్డి.. కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అభియోగాలు మోపారు.. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం వెలుగు చూసింది..…
Jamuna Memories: మొన్ననే కేంద్రం ‘పద్మ’ అవార్డులను ప్రకటించినప్పుడు నాటి అందాలతార, మేటి నటి జమునకు ఇప్పటి దాకా ఎందుకని ‘పద్మ’ పురస్కారం లభించలేదన్న చర్చ తెలుగుసినిమా జనాల్లో చోటుచేసుకుంది. ఆ చర్చ ఇంకా ముగింపు రాకుండానే మహానటి జమున కన్నుమూశారన్న వార్త ఆమె అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తిందనే చెప్పాలి. తెలుగుతెరపై జమున లాగా వెలిగిన తార మరొకరు కానరారు. దాదాపు పాతికేళ్ళు నాయికగా రాణించారామె. అనితరసాధ్యంగా తనదైన అభినయంతో తెలుగువారినే కాకుండా, తమిళ, కన్నడ, హిందీ…
Director Venky Atluri Engagement: సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామందే పెళ్లి పీటలు ఎక్కారు. ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే ‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
2019లో 'రాజా వారు రాణి గారు'తో అరంగేట్రం చేసాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సక్సస్ తర్వాత 2021లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' గ్రాండ్ కమర్షియల్ హిట్ కావటంతో ఒక్క సారిగా కిరణ్ అబ్బవరం పేరు మారుమ్రోగిపోయింది.
తెలుగు చలన చిత్రాలకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాతల శ్రేయస్సు కోరి తెలుగు సినిమాను కాపాడుకుందామనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది.