Telugu Movies getting advantage of huge Holidays in Comingdays: సాధారణంగా తెలుగు సినీ సీజన్ల గురించి మాట్లాడితే సంక్రాంతికి మించిన సీజన్ మరొకటి లేదు. సంక్రాంతి తర్వాత వేసవికాలంలో ఎక్కువగా సినిమాలు కలెక్షన్లు రాబట్టే అవకాశాలుంటాయి. అందుకే అప్పుడప్పుడు బడా సినిమాలను కూడా వేసవిని టార్గెట్ చేసుకొని రిలీజ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం పెద్ద సినిమాలు ఏవీ వేసవిలో రిలీజ్ అవ్వడం లేదు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ఏప్రిల్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేసి దసరాకి డేట్ కన్ఫామ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే రేపు 29వ తేదీ నుంచి మొదలు పెడితే 24 రోజుల వ్యవధిలో 13 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి.
Tillu Square First Review: టిల్లు స్క్వేర్‌లో ఇవే హైలైట్స్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
కాస్త షాక్ కలిగించినా అది నిజమే. ఎలా అంటే 29 మార్చి – గుడ్ ఫ్రైడే, 30 మార్చి – వీకెండ్ సాటర్డే, 31 మార్చి – వీకెండ్ సండే, – ఏప్రిల్ 05 – బాబు జగ్జీవన్ రామ్ జయంతి,- 06 ఏప్రిల్ – వీకెండ్ సాటర్డే,- 07 ఏప్రిల్ – వీకెండ్ సండే, – ఏప్రిల్ 09 – ఉగాది, – ఏప్రిల్ 10 – రంజాన్, – 13 ఏప్రిల్ – వీకెండ్ సాటర్డే,- 14 ఏప్రిల్ – వీకెండ్ సండే, – ఏప్రిల్ 17 – రామ నవమి, – 20 ఏప్రిల్ – వీకెండ్ సాటర్డే, – 21 ఏప్రిల్ – వీకెండ్ సండే. అలా మొత్తం 13 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. ఈ వ్యవధిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమాలేవైనా ఉన్నాయి అంటే అవి టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు ఫ్యామిలీ స్టార్ సినిమా. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29వ తేదీ రిలీజ్ అవుతుంటే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం ఏప్రిల్ ఐదో తేదీన రిలీజ్ అవుతున్నాయి. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి కానీ అవి పెద్దగా జనానికి నోటెడ్ అవలేదు. ఇక ఈ రెండు సినిమాలకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులకు వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి కచ్చితంగా ధియేటర్లకు ఈ సినిమాలు చూసేందుకు వెళతారు. సో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవడం కాదు ఆయా హీరోలకు కెరియర్ బెస్ట్ గ్రాసర్లు అయినా ఆశ్చర్యం లేదంటున్నారు అనలిస్టులు.