నవంబర్ మొదటి రెండు వారాలు కలిపి దాదాపు పది తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఒక్క మూడో వారంలోనే పది సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండే పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మరో రెండు నెలల పాటు తమకు థియేటర్లు దొరకవేమోననే ఆందోళనలో చిన్న చిత్రాల నిర్మాతలు ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ తో పాటు జనవరిలోనూ అగ్ర కథానాయకుల చిత్రాలు మూడు పండగ బరిలో నిలుస్తున్నాయి.…
అనసూయ భరద్వాజ్. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు జబర్దస్త్ విందు చేసుకుంటారు. షో ప్రారంభమై ఎన్నేళ్ళయినా ఖతర్నాక్ డ్యాన్స్ లతో ఆమె బుల్లితెర ప్రేక్షకుల్ని కనువిందు చేస్తుంటుంది. స్కిట్ స్కిట్ల మధ్యలో అనసూయ చేసే డ్యాన్స్ లు కుర్రకారుని మతి పోగొడుతుంటాయి. బుల్లితెర కాదు వెండితెర పై కూడా అనసూయ అలరిస్తూనే వుంది. వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి…