ఆడియన్స్‌ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్‌ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం.
ఈఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గోపీచంద్,శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో వుండడంతో.. ఈ కాంబినేషన్‌లో రూపొందిన ‘విశ్వం’ క్రేజ్ లేకుండా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వున్నా… మౌత్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ వీకెండ్ థియేటర్స్‌లో విశ్వం సందడే కనిపించింది. సత్య, శ్రీ సింహా, ఫరియా నటించిన మత్తువదలరా2 యూత్‌కు కిక్ ఎక్కించడంతో.. 4రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 8 కోట్లకు అమ్మితే.. 16 కోట్లు తీసుకొచ్చింది.
Game Changer vs Thandel: మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని మరింత పెంచుతున్న చైతు?
హీరోలకు పెద్దగా క్రేజ్ లేకపోయినా ఫర్వాలేదు. డైరెక్టర్ ఎవరో కూడా తెలీకపోయినా పట్టించుకోరు. మనసును నవ్వులతో నింపేస్తే చాలు హిట్ చేసేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన ఆయ్‌ను సూపర్‌హిట్ చేశారు తెలుగు ఆడియన్స్. ఈ ఏడాది సమ్మర్ సీజన్ జోరంతా కామెడీ సినిమాలదే. శ్రీవిష్ణు, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ నటించిన ఎంటర్టైన్‌మెంట్ మూవీ ‘ఓం భీమ్ బుష్’ ఇంటర్ ఎగ్జామ్స్.. మరోవైపు ఐపియల్‌ను ఎదుర్కొని.. బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 10 కోట్లకు అమ్మితే.. పెట్టుబడిని రాబట్టింది. ఇక టిల్లు స్క్వేర్ అయితే.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. డిజె టిల్లు హిట్ తర్వాత వచ్చిన సీక్వెల్‌పై భారీ అంచనాలు వున్నా… మొదటి రోజు ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది.సినిమాను వరల్డ్ వైడ్ 27 కోట్లకు అమ్మితే… 69 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.