Tollywood Releases in Rush with out Planning: తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారయింది. అసలు విషయం ఏమిటంటే సినిమాలు రిలీజ్ డేట్ లో విషయంలో ఎందుకో నిర్మాతలు పెద్దగా శ్రద్ధ చూపించడం లేదేమో అనిపిస్తుంది. అయితే అన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. సెలవులు ఏవైనా కలిసి వస్తాయి అంటే అనుకోవచ్చు ఒక్కోసారి సెలవులు లేకపోయినా కావాలని ఒకే డేట్ కి చాలా సినిమాలను రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఊరు పేరు లేని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అంటే అర్థం ఉంది. కానీ కాస్తో కూస్తో పేరు ఉన్న హీరోలు పేరు ఉన్న దర్శకుల సినిమాలను కూడా గుంపులో రిలీజ్ చేస్తూ ఉండటం వలన ఏ సినిమాకి సరైన స్థాయిలో బుకింగ్స్ నమోదు అవ్వని పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ లో నెలకొంది. గత వారం సినిమాలు దసరాకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.
Pawan kalyan: సినిమా టికెట్ల ధరలపై పవన్ కళ్యాణ్ కి కీలక సూచనలు!
గోపీచంద్, సుధీర్ బాబు సహా సుహాస్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. కానీ మూడు సినిమాలకు కలెక్షన్స్ విషయం మాత్రం అంతంత మాత్రమే. ముగ్గురు హీరోలు సోలో డేట్ లో వచ్చి బాగా ప్రమోట్ చేసుకుంటే కంటెంట్ క్లిక్ అయితే కాస్త దండిగా డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. అలా కాదని అందరూ ఒకేసారి వస్తే . … చాలా సెంటర్లలో పండగ పూట కూడా ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించలేని పరిస్థితి కనిపిస్తోంది. మొన్న వారం సెలవులు ఉన్నాయి అనుకున్నారో లేక పండగ సీజన్ కదా వర్కౌట్ అవుతుంది అనుకున్నారో తెలియదు కానీ ఈ సినిమాలతో పాటు వెట్టయాన్, మార్టిన్ అనే రెండు డబ్బింగ్ సినిమాలతో పాటు జిగ్రా అనే మరో డబ్బింగ్ సినిమాని కూడా వదిలారు. ఈ వారం అసలు చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు.
కాస్త కూస్తో వీక్షణం లవ్ రెడ్డి అనే సినిమాల పేర్లు కాస్త గట్టిగా వినపడుతున్నాయి ఆ సినిమాలు కూడా స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలు కాదు కాస్తో కూస్తో బజ్ మాత్రం ఏర్పడేలా చేసుకున్నారు మేకర్లు. ఇప్పుడు మరో రెండు వారాల తర్వాత అంటే దీపావళికి కూడా ఇదే రకమైన రష్ ఏర్పడుతోంది. ఇప్పటికే దీపావళి కోసం చాలామంది కర్చీఫ్లు వేసుకున్నారు ముఖ్యంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క, సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలు 31 అక్టోబర్ న రిలీజ్ అవుతున్నాయి.. ఇవి కాకుండా పలు డబ్బింగ్ సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. శివ కార్తికేయన్ అమరన్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ బంధువు శ్రీ మురళీ నటించిన భగీర సినిమా కూడా అదే రోజున రిలీజ్ చేయబోతున్నారు. అదే సమయంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ ని కూడా రంగంలోకి దించుతున్నారు. మొత్తంగా చూస్తే మూడు తెలుగు సినిమాలు రెండు డబ్బింగ్ సినిమాలు మరోసారి దీపావళి సీజన్ కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
వీటిలో దుల్కర్ లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం సినిమాలకి కాస్త బజ్ ఉంది. శివ కార్తికేయన్ అమరన్ సినిమా మీద కూడా ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. ఆ తర్వాత కాస్తో కోస్తూ ప్రశాంత్ నీల్ కథ అందించడంతో భగీర మీద కూడా ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. కానీ ఒక్కరోజు సెలవుకి ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే ప్రేక్షకులు ఏ సినిమాకి వెళ్లాలో కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా కోసం వెయిట్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాగా మూడు నాలుగు సినిమాలను ఒకేరోజు రిలీజ్ చేయడం కాకుండా కాస్త కూస్తో పేరు ఉన్న హీరోలు సోలో రిలీజ్ లకు వెళ్లడం బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.