After realising the negative impact of the Over The Top (OTT) platform on the footfall to the movie theatres, the Telugu Films Producers Council (TFPC) has taken a decision to stream the movies on OTT 50 days after the theatrical release of the films.
తెలుగు సినిమా రంగంలో ‘భీష్మాచార్యుడు’ అనిపించుకున్నారు ప్రముఖ నిర్మాత డి.వి.యస్. రాజు. ఆయన తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మిస్తూ సాగారు. యన్టీఆర్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన రాజు 1971లో రామారావు, జగ్గయ్యతో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ యువజంటగా అభినయించారు. ఆ చిత్రం నుంచీ శోభన్ బాబు, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో సినిమాలు తీశారు డి.వి.యస్.రాజు. విశ్వనాథ్, శోభన్ బాబు కాంబోలో…
తమిళంలో జయకేతనం ఎగురవేసిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయి అలరించాయి. అలాగే ఇక్కడ విజయాన్ని చవిచూసిన సినిమాలు అక్కడా సక్సెస్ ను సాధించాయి. అలా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన ‘సవాలే సమాలి’ ఆధారంగా తెలుగులో ఏయన్నార్ ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం తెరకెక్కింది. అంతకు ముందు 1955లో ఏయన్నార్ నటించిన ‘రోజులు మారాయి’ సినిమాలోలాగే ఇందులోనూ ఊరి పెదకామందుకు, హీరోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. అదే కథకు ఓ…
చూడగానే మనోడే అనిపించే పర్సనాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే పక్కింటి కుర్రాడికి మల్లే ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతనికి ఎస్సెట్ అనీ చెప్పొచ్చు. అనేక లఘు చిత్రాల్లో నటించిన రాజ్ తరుణ్ కు దర్శకుడు కావాలన్నది అభిలాష. ఆ కోరికతోనే చిత్రసీమలో అడుగు పెట్టాడు. ‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేయసాగాడు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు విరించి వర్మ సినిమాలో హీరో కేరెక్టర్ కు రాజ్ తరుణ్…
మే 11వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు బర్త్ డే! దాంతో అతను నటిస్తున్న సినిమాల పోస్టర్స్ బర్త్ డే విషెస్ తో వస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా సుధీర్ బాబు – హర్షవర్థన్ కాంబినేషన్ లో మూవీని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి. సంస్థ టైటిల్ ను ప్రకటించింది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ అనే పేరు ఖాయం చేశారు. విశేషం ఏమంటే…
‘ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇందులో గొప్పేముంది? ‘మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్’ – ఇది కదా మజా ఇచ్చేది! సినిమా రంగంలో అధిక సంఖ్యాకులు ‘ప్లస్ ఇంటూ ప్లస్’కే జై కొడతారు. కానీ, కొన్నిసార్లు ‘మైనస్ ఇంటూ మైనస్ – ప్లస్’ అవుతుందనీ నిరూపణ అయ్యింది. అలా చేసిన చిత్రాల్లో పదేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా జనం ముందు నిలచిన ‘గబ్బర్ సింగ్’ కూడా…
తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు వినగానే, ఆయన విలక్షణమైన అభినయం ముందుగా గుర్తుకు వస్తుంది. ధనుష్ తండ్రి కార్తిక్ రాజా తమిళ చిత్రసీమలో పేరు మోసిన రచయిత, దర్శకుడు. అన్న సెల్వరాఘవన్ పేరున్న దర్శకుడు. ఆరంభంలో వారి నీడన నిలచిన ధనుష్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయ్యాడు. ఇవన్నీ ధనుష్ కు మొదటిరోజుల్లో కాసింత గుర్తింపు తేవడానికి పనికి వచ్చాయి. తరువాత అంతా ధనుష్ స్వయంకృషితో సాధించుకున్నదే. తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో…
ప్రతి మనసులో రాతగాడు దాగుంటాడో లేదో కానీ, ప్రతి మనిషిలో ఓ పాటగాడు మాత్రం తప్పనిసరిగా ఉంటాడు అంటారు మానసిక నిపుణులు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరూ కూనిరాగాలు తీసేవారే. చివరకు బుద్ధిమాంద్యం ఉన్నవారిలోనూ పాట పాడాలనే తలంపు ఉంటుందనీ చెబుతారు. నేడు గీత రచయితగా తనదైన పంథాలో పయనిస్తున్న చంద్రబోస్ చదువుకున్నది ఇంజనీరింగ్. గాయకుడు కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. కానీ, చిత్రంగా వందలాది మంది గాయకుల నోట తన పాటను పలికించే స్థాయికి చేరుకున్నారాయన.…
నటరత్న యన్.టి.రామారావు చిత్రసీమలో ప్రవేశించక మునుపు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘జానపద చిత్రాల కథానాయకుని’గా ఓ వెలుగు వెలిగారు. తరువాతి రోజుల్లో అత్యధిక జానపదాల్లో నటించిన ఘనతను యన్టీఆర్ సొంతం చేసుకోగా, ఏయన్నార్ సాంఘిక చిత్రాలతో ముందుకు సాగారు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ రామారావుకు తొలి జానపద చిత్రం కావడం విశేషం. ఇక వారిద్దరూ నటించిన తరువాతి సినిమా ‘సంసారం’ ఏయన్నార్ కు మొట్టమొదటి సాంఘిక చిత్రం కావడం ఇంకో…
‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిన నరేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘అల్లరి’ సినిమా విడుదలై మే 10వ తేదీకి ఇరవై సంవత్సరాలు అవుతోంది. హీరోగా నరేష్ కు, దర్శకునిగా రవిబాబుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ‘అల్లరి’ చిత్రం 2002 మే 10న విడుదలయింది. ‘అల్లరి’ చిత్రం కథ ఏమిటంటే – రవి, అపర్ణ చిన్ననాటి స్నేహితులు. ఒకే అపార్ట్ మెంట్స్ లో ఉంటారు. రుచి అనే అమ్మాయి వాళ్ళుండే అపార్ట్ మెంట్స్ లో…