మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సెట్స్ పైన పలు చిత్రాలు వివిధ దశల్లో ఉండగానే ఈ రోజు విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో కొత్త సినిమాను ప్రారంభించింది. విశేషం ఏమంటే… ఈ నిర్మాణ సంస్థ నిన్నటి నుండి ఓ రకంగా విజయోత్సవాన్ని జరుపుకుంటోంది. బుధవారం నేచురల్ స్టార్ నానితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఆ వేదికపైనే నాని…
‘నువ్వు నేను ఒక్కటవుదాం’, ‘జువ్వ’ చిత్రాలలో హీరోగా నటించిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు రంజిత్ సోమి తాజా చిత్రం ‘లెహరాయి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ లోగోను గురువారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘లెహరాయి’ సినిమాను రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. ఇదే వేదికపై ఫస్ట్…
‘కేజీఎఫ్-2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలచింది మొదలు అన్ని భాషల్లోనూ గణనీయమైన వసూళ్ళు చూస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఓ వెయ్యి కోట్ల రూపాయలు పోగేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఈ సినిమా ‘బాహుబలి-2’ను అధిగమిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అది కలలోని మాటే అని చెప్పాలి. ఎందుకంటే ‘బాహుబలి-2’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఎటు చూసినా ‘కేజీఎఫ్-2’ కు అంత సీన్ లేదని తెలుస్తోంది. అయితే బాలీవుడ్…
ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో మన తెలుగువాడయిన ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారుమోగి పోతోంది. తన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’తో రాజమౌళి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1084 కోట్లు పోగేసింది. భారతదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం రూ. 880.4 కోట్లు మూటకట్టింది. ఇక విదేశాలలో ఈ సినిమా రూ.203.6 కోట్లు రాబట్టింది. వెరసి మొత్తం రూ.1084 కోట్లు కొల్లగొట్టి, ఈ యేడాది…
రచయితల టైటిల్ కార్డ్ చూసి కూడా జనం చప్పట్లు కొట్టే రోజులు అప్పట్లోనే ఉండేవి. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో త్రిపురనేని మహారథి సైతం చోటు సంపాదించారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ‘నేరుగా కథ చెప్పడమే’ ప్రధానంగా ఉండేది. కానీ, అందులోనూ స్క్రీన్ ప్లే ను చొప్పించి మరింత రంజింప చేయవచ్చునని కొందరు రచయితలు తలచారు. వీరందరూ పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో అలా రాస్తున్నారనీ కొందరు విమర్శించేవారు. అయితే భవిష్యత్ లో ‘స్క్రీన్ ప్లే’కు విశేషమైన స్థానం…
’30 వెడ్స్ 21′ సీజన్ 2 లో చూస్తుండగానే 6వ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. నిజానికి ఈ సీజన్ లో కథ కంటే కథనానికే దర్శకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్స్ కు కాస్తంత భిన్నంగా ఈ 6వ ఎపిసోడ్ సాగింది. వ్యూవర్స్ ఊహకు చిక్కకుండా కథను డైరెక్టర్ పరుగులు తీయించాడు. ‘సారీ పృథ్వీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆసక్తికరంగా సాగింది. లాస్ట్ ఎపిసోడ్ లో తన…
చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు కశ్మీర్ లో నిర్మించిన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, హీరో నితిన్ నాష్, దర్శకుడు రవికుమార్ పాల్గొన్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్…
నేహాశెట్టి… ‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన…
తొమ్మిది పదుల వయసులో నేటికీ తొణక్క బెణక్క హుషారుగా సాగుతున్న మేటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో తొలి పద్మ అవార్డు చోటు చేసుకుంది. 72 సంవత్సరాల నటనాజీవితం గడిపిన షావుకారు జానకి వంటి మేటి నటికి ఇన్నాళ్ళకు, ఇన్నేళ్లకు పద్మశ్రీ పురస్కారం లభించడం ఆమె అభిమానులకు ఆనందం పంచుతోంది. అయితే, చాలా ఆలస్యంగా జానకికి ఈ అవార్డు లభించిందని కొందరు ఆవేదన చెందుతున్నారు. జానకి మాత్రం ఎప్పుడు వచ్చింది అన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం…
ఏ రంగంలో రాణించాలన్నా కృషిని మించిన సూత్రం లేదు. అయితే చిత్రసీమలో మాత్రం కృషి కంటే అదృష్టం ముఖ్యం అంటూ ఉంటారు. గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటేనే చిత్రసీమలో రాణించగలమని చెబుతారు సినీపెద్దలు. నవయువ కథానాయకుడు నాగశౌర్యలో ప్రతిభ ఎంతో ఉంది. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో నటించేశాడు. కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకింప చేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా…