Birthday : అదుగో… ‘చలపాయ్ బాబాయ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిండైన విగ్రహంతో విలన్ గా జడిపించి, కమెడియన్ గా కితకితలు పెట్టి, కొన్నిసార్లు సెంటిమెంట్ నూ పండించి జనాన్ని ఆకట్టుకున్నారు చలపతిరావు. అనేక ప్రేమకథా చిత్రాల్లో అమ్మాయికో, అబ్బాయికో తండ్రిగా నటించి అలరించారాయన. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న యన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. ఆయన తనయుడు రవిబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ నటునిగా మారినా, తరువాత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గానూ మెప్పించారు. తండ్రినీ డైరెక్ట్ చేశారు రవిబాబు. అలా పుత్రోత్సాహంతో పొంగిపోతుంటారు చలపతిరావు.
తమ్మారెడ్డి చలపతిరావు 1944 మే 8న కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించారు. ఆయన కన్నవారు మణియ్య, వియ్యమ్మ. చదువుకొనే రోజుల నుంచీ చలపతిరావుకు సినిమాలంటే పిచ్చి. యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు చూసి, ఆయనలా తానూ తెరపై కనిపించాలని ఆశించారు చలపతిరావు. మద్రాసు చేరుకొని పలు ప్రయత్నాలు చేశారు. కొన్ని చిత్రాలలో చిన్నాచితకా పాత్రల్లో కనిపించారు. తరువాత యన్టీఆర్ ను కలసి తన పరిస్థితి వివరించగా, ఆయన ప్రోత్సహించారు. అలా తొలిసారి తెరపై డైలాగ్ చెప్పే పాత్ర యన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో లభించింది. ఇందులో యన్టీఆర్, నాగభూషణం మునిసిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయగా, ఎన్నికల అధికారి పాత్రలో చలపతిరావు నటించారు. 1969లో విడుదలైన ‘కథానాయకుడు’ ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందులో చలపతిరావుకు కాసింత గుర్తింపు లభించింది. ఆ తరువాత నుంచీ యన్టీఆర్ చిత్రాలలో తనకు లభించిన వేషాలు వేస్తూ ముందుకు సాగారు. అనేక చిత్రాలలో విలన్ దగ్గర ఉండే అనుచరునిగా కనిపించారు. పలు సినిమాల్లో అమ్మాయిలను రేప్ చేసే పాత్రల్లోనూ నటించారు. దాంతో అలాంటి వేషాలే చలపతిరావును పలకరించసాగాయి.
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
- Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
చలపతిరావు నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’. ఈ చిత్రానికి యన్టీఆరే దర్శక నిర్మాత. పైగా ఈ సినిమాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దాంతో చలపతిరావుతో యన్టీఆర్ పలు పాత్రలు పోషింప చేశారు. సూతుడు, ఇంద్రుడు, బ్రాహ్మణుడు, జరాసంధుడు వంటి పాత్రల్లో ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో కనిపించారు చలపతిరావు. సంచలన విజయం సాధించిన ఆ చిత్రం తరువాత చలపతిరావుకు మంచి పాత్రలు రావడం మొదలయింది. అప్పటి దాకా బిట్ రోల్స్ లో కనిపించిన చలపతిరావు, ఆ తరువాత కాసింత గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించసాగారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన తొలి చిత్రం ‘గులాబి’లో హీరోయిన్ తండ్రి పాత్రను ధరింప చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. చలపతిరావు ఇలాంటి పాత్రలూ పోషించగలరా అని జనం అనుకొనేలా చేశారు. ఆ పై కృష్ణవంశీ తన రెండో చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’లో హీరో నాగార్జునకు తండ్రిగా చలపతిరావును నటింప చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటి నుంచీ చలపతిరావుకు అనేక చిత్రాలలో నాయికానాయకులకు తండ్రిగా నటించే అవకాశాలు లభించాయి.
చలపతిరావు భాగస్వామిగా కొన్ని చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా ‘కలియుగ కృష్ణుడు’ నిర్మాణంలో తొలిసారి ఆయన భాగస్వామి అయ్యారు. తరువాత “కడప రెడ్డెమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ళ పంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి” వంటి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. కొంతకాలంగా చలపతిరావు చిత్రాలలో కనిపించడం లేదు. ఈ యేడాదితో 78 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు చలపతిరావు. ఏది ఏమైనా చలపతిరావు పేరు వినగానే ఆయన పోషించిన పలు పాత్రలు మన కనుల ముందు కనిపించక మానవు.
తాజావార్తలు
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!