‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న లక్ష్య ప్రస్తుతం ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’, ‘ధీర’ సినిమాల్లో నటిస్తున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పి. సి. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్…
నిండైన విగ్రహంతో విలన్ గా జడిపించి, కమెడియన్ గా కితకితలు పెట్టి, కొన్నిసార్లు సెంటిమెంట్ నూ పండించి జనాన్ని ఆకట్టుకున్నారు చలపతిరావు. అనేక ప్రేమకథా చిత్రాల్లో అమ్మాయికో, అబ్బాయికో తండ్రిగా నటించి అలరించారాయన. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న యన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. ఆయన తనయుడు రవిబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ నటునిగా మారినా, తరువాత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గానూ…
తెలుగు చిత్రసీమలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో తెరకెక్కిన ఐదు చిత్రాలలో నాలుగు వరుసగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి.గోపాల్ రూపొందించిన ‘లారీ డ్రైవర్’ సైతం సూపర్ హిట్ గా నిలచింది.…
దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన అనేక చిత్రాలలో స్త్రీల సమస్యలను చర్చిస్తూ వాటికి తగిన పరిష్కారాలు చూపించారు. తమిళంలో అదే తీరున కె.బాలచందర్ సాగారు. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు-పడమర’గా రీమేక్ చేశారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంతో శ్రీవిద్య, నరసింహరాజుకు మంచి పేరు లభించింది. ఆ సినిమా విడుదలైన ఆరు నెలలకు దాసరి తన సొంత కథతో రూపొందించిన చిత్రం ‘కన్య-కుమారి’. ఇందులో కన్యగా జయమాలిని,…
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే వార్త.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవర్ స్టార్ ప్రస్తుతం.. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. పవర్ స్టార్ రాబిన్ హుడ్…
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఇప్పటికే మహేష్ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే దాని కంటే ముందే.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి అఫిషీయల్ అనౌన్మ్సెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. మే 7న ఈ ఈవెంట్ డేట్ను లాక్…
ఎన్టీఆర్-సాయి పల్లవి.. ఈ క్రేజి కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. అదిరిపోయే స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుందనడంలో ఎలా సందేహం లేదు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత పల్లవి మరో సినిమాకు కమిట్ అవలేదు. దాంతో ఇక ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా వినిపించింది.…
కెరీర్ మొదటి నుంచి వైవిధ్యంగా ముందుకు సాగుతూ.. కథా బలమున్న సినిమాలు చేస్తు.. వరుస విజయాలు అందుకుంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఈ టాలెంటెడ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘మేజర్’. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా.. ఈ సినిమా రూపొందుతోంది. అడివి శేష్ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో.. మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్..…
‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ అనేది సినిమా వెలుగు చూసిన రోజుల నుంచీ ఉన్న నానుడి. అందువల్ల సినిమా దర్శకునికి ఎంతో క్రమశిక్షణ అవసరం అని పలువురు భావించేవారు. అలాంటివారు తాము దర్శకత్వం చేస్తున్న సమయంలో క్రమశిక్షణతో మెలగడగమే కాదు, కృషి, దీక్ష, పట్టుదలకు చిహ్నంగా ‘యూనిఫామ్’ కూడా ధరించేవారు. తెలుగునాట కొందరు దర్శకులు ఆ పంథాలో పయనించారు. ఎక్కువమంది దర్శకులు వైట్ అండ్ వైట్ వేసుకొనేవారు. కానీ, ‘ఖాకీ’ దుస్తులు అంటే క్రమశిక్షణకు, శ్రమకు ప్రతీక…
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి .అభిరుచి గల నిర్మాతలు రాజీపడరు. అలాగని కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడరు. ఫలితం ఎలా ఉంటుందో తెలియక పోయినా, తమ అభిరుచికి తగ్గ రీతిన సినిమాలు తెరకెక్కించి, ఆనందిస్తారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగు సినిమా విలువ తరిగిపోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించి, జాతీయ స్థాయిలో తెలుగు వెలుగును ప్రసరింపచేశారాయన. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారాయన.…