మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఇప్పటికే మహేష్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే దాని కంటే ముందే.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి అఫిషీయల్ అనౌన్మ్సెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. మే 7న ఈ ఈవెంట్ డేట్‌ను లాక్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు.. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున ఈ ఈవెంట్ చేయబోతున్నట్టు.. It’s time for celebrations అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ సినిమాలో వచ్చే లాస్ట్ మాస్ సాంగ్‌కు సంబంధించినదిగా ఉంది. మహేష్ ఈ లుక్‌లో అదిరిపోయాడనే చెప్పాలి. దాంతో మహేష్ అభిమానులు మాస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు. అయితే ఈ వేడుకకు ఎవరైనా గెస్ట్‌గా రాబోతున్నారా.. అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.
ఇక ఈ సినిమా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సర్కారు వారి పాట సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ట్రైలర్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. 31 మిలియన్స్ పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్‌లో మహేష్ బాబు ఎనెర్జిటిక్ ఫర్ఫార్మెన్స్.. కామెడీ టైమింగ్ అదిరిపోయేలా ఉంది. ఇలా అన్ని విధాలుగా ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో.. ఈ సినిమా పక్కాగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.దాంతో మే 12న సర్కారు వారి పాట మాస్ జాతర జరగబోతోందని అంటున్నారు. మరి భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.